E-Paper
Advertisement

Lift Crash: 8 అంతస్తుల నుంచి పడిన లిఫ్ట్.. ఐసీయూలో ఐదుగురు

Lift Crash: 8 అంతస్తుల నుంచి పడిన లిఫ్ట్.. ఐసీయూలో ఐదుగురు
Advertisement

Lift Crash: జనాభా పెరిగే కొద్దీ.. ప్రధాన నగరాల్లో అపార్ట్ మెంట్ల సంఖ్య పెరుగుతోంది. వాటిలో ఉండే నివాసితుల సౌకర్యార్థం లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ.. లిఫ్ట్ ల వద్ద సరైన నిర్వహణ లేకపోవడంతో.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో లిఫ్ట్ లో ఇరుక్కుని చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా.. యూపీలో 8వ అంతస్తు నుంచి లిఫ్ట్ పడిపోవడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని ఎత్తైన భవనంలో ఐటీ డెవలపర్ కంపెనీ ఉంది. అక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు.. డ్యూటీ అవగానే ఇంటికి బయల్దేరారు. కిందికి దిగేందుకు లిఫ్ట్ లో 9 మంది ఎక్కారు. ఒక్కసారిగా ఆ లిఫ్ట్ 8వ అంతస్తు నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లిఫ్ట్ ను తెరచి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురికి తీవ్రగాయాలు అవ్వగా.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా.. లిఫ్ట్ ప్రమాదానికి గరవ్వడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు లిఫ్ట్ సిబ్బందిని కస్టడీలోకి తీసుకున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×