BigTV English

Dec 31st: మందుబాబులకు గుడ్ న్యూస్.. సర్కార్ న్యూ ఇయర్‌ ఆఫర్..

Dec 31st: మందుబాబులకు గుడ్ న్యూస్.. సర్కార్ న్యూ ఇయర్‌ ఆఫర్..

Dec 31st: డిసెంబర్ 31 నైట్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటారు. కేక్ కటింగ్స్ లాంటి చిన్న చిన్న పనులే కాకుండా.. డీజే పార్టీస్ లాంటి హంగామా మామూలుగా ఉండదు. ఇళ్లల్లో కొందరు.. కమ్యూనిటీ సెంటర్లలో ఇంకొందరు.. క్లబ్బులు, పబ్బుల్లో మరికొందరు. వారి స్థాయి, వారి టేస్ట్ కు తగ్గట్టు సెలబ్రేషన్స్ చేస్తుంటారు. వీళ్లంతా ఒక లెక్క. మందుబాబుల వేడుకలు మరో లెక్క.


మందుబాబులకు డిసెంబర్ 31 అంటే ఎంతో ప్రేమ. ఆ రోజు కోసం చాలారోజులుగా వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ అవుతుందా అని ఆశ పడుతుంటారు. వారి ఫోకస్ అంతా మందు మీదే. ఫుల్లుగా తాగాలి.. తాగుతూ, తింటూ చిందులేయాలి. అంతే. వారికి ఇంకా వేటితో సంబంధం ఉండదు. కేకులు గట్రా పట్టించుకోరు. మందు, మంచింగ్ ఉంటే చాలు. ఫుల్ గా తాగేసి.. అర్థరాత్రి బయటికొచ్చి.. రోడ్లపై హంగామా చేయడమే వారి స్టైల్. కానీ…..

ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. కరెక్ట్ గా 11 కాగానే పోలీసులు వచ్చి వైన్లు బంద్ చేస్తుంటారు. 12కల్లా బార్లు క్లోజ్ చేపిస్తారు. సరిగ్గా కిక్ ఎక్కే సమయానికి షాపులకు తాళాలు. పాపం మందుబాబులు ఆ టైమ్ లో ఎక్కడికి పోవాలి? వారికి మందెక్కడ దొరుకుతుంది?


సరిగ్గా 12 గంటలకు.. హ్యాపీ న్యూయర్ అంటూ గట్టిగా అరిచే సరికి అప్పటి వరకూ తాగిందంతా దిగిపోతుంటుంది. మళ్లీ కొన్ని పెగ్గులు వేద్దామంటే వైన్స్, బార్స్ బంద్ అవుతాయి. వారి కష్టం వారికే తెలుసు. అందుకే, మందుబాబుల కష్టాన్ని తెలంగాణ సర్కారు అర్థం చేసుకుంది. కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో ఆ రోజు మద్యం విక్రయాల సమయాన్ని పొడిగించింది.

డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించేందుకు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ అనుమతిచ్చింది. వైన్స్ లో 12 గంటల వరకు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మేందుకు పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో మందుబాబులకు ఇక పండగే.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×