BigTV English

Gruha Jyothi Scheme: అమల్లోకి ‘గృహజ్యోతి’ పథకం.. 200 యూనిట్ల కరెంట్.. కానీ కండిషన్స్ అప్లై!

Gruha Jyothi Scheme: అమల్లోకి  ‘గృహజ్యోతి’ పథకం.. 200 యూనిట్ల కరెంట్.. కానీ కండిషన్స్ అప్లై!

Gruha Jyothi Scheme Guidelines: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తామని చెప్పిన రేవంత్ సర్కార్.. చెప్పిన మాట ప్రకారం ఒక్కోహామీని అమలు చేస్తూ వస్తోంది. ఇటీవలే మరో రెండు పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలుపగా.. వాటి అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. అందులో గృహజ్యోతి అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది.


అయితే.. నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినవారికి ఈ పథకం వర్తించదు. ఇప్పటికి ఈ పథకం కోసం కోటి 9 లక్షల, 1255 దరఖాస్తులు రాగా.. వాటిలో 64 లక్షల 57 వేల 891 మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. గృహజ్యోతి అమలుకు ఏటా.. రూ.4,164.29 కోట్ల ఖర్చు ఉంటుందని రాష్ట్ర ఇంధనశాఖ అంచనా వేసింది. అలాగే పథకానికి ఎవరెవరు అర్హులవుతారో తేల్చే అంశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Read More: మహిళలకు శుభవార్త.. అదేంటంటే..?


మార్చి 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుండగా.. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా పథకం అమలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23 నెలకు సగటున వాడిన విద్యుత్ కు అదనంగా 10 శాతం విద్యుత్ ను మాత్రమే గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. 2022-23లో నెలకు సగటున 200 యూనిట్లకు మించి విద్యుత్ ను వాడినట్లైతే ఈ పథకం వర్తించదు.

లబ్ధిదారుడి రేషన్ కార్డు ఆధార్ తో అనుసంధానమై ఉండాలి. విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండకూడదు. నెలకు 101 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను పొందుతున్న ఎస్సీ, ఎస్టీలకు కూడా గృహజ్యోతి వర్తిస్తుంది. 64,57,891 తెల్లరేషన్ కార్డుదారుల్లో.. 34 లక్షల 59 వేల 585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ ను కలిగి ఉంటారు.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×