
Guvvala Balaraju | నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి కాంగ్రెస్ నాయకులే చేశారని బాలరాజు చెప్పడంతో.. మంత్రి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బాలరాజు డబ్బులు పంచడానికి వెళ్తున్నారని పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. అయితే బాలరాజుపై చర్యలు తీసుకోకుండా పోలీసులు కాంగ్రెస్ నేతలనే బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాలరాజు, మంత్రి కేటీఆర్ కుట్ర పన్ని తమపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇంతకముందు కూడా ఇలాగే మంత్రి కేటీఆర్ ఫాక్స్ కాన్‌పై తప్పుడు ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఎన్నికల వ్యూహకర్తగా ఉంటే అక్కడ ఇలాంటి దాడులు జరిగినట్లు డ్రామాలు ఉంటాయని, పశ్చిమ బెంగాల్లో కూడా గతంలో మమతా బెనర్జీ ఇలాగే తనపై దాడి జరిగినట్లు డ్రామా చేసి వీల్ చైర్‌పై ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ లాగే మంత్రి హరీష్ రావు కూడా కొత్త ప్రభాకర్ పై దాడి జరిగినప్పుడు చాలా బాగా నటించారని ఎద్దేవా చేశారు.
కొత్త ప్రభాకర్ పై తానే దాడి చేయించినట్లు కేసీఆర్ కుటుంబం బాగానే ప్రచారం చేసిందని మండిపడ్డారు. ప్రభాకర్ పై దాడి సంచలనం కోసమే జరిగిందని ఆ జిల్లా ఎస్పీనే చెప్పారని గుర్తు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రమేయం లేదని ఎస్పీనే స్పష్టంగా చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కొత్త ప్రభాకర్ పై దాడి కేసులో ఇంతవరకు ఎటువంటి రిమాండ్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో ఇలాగే మూడు కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.. మరి ఎన్నికల అధికారులు ఆయన వ్యాఖ్యలను ఎందుకు సుమోటోగా తీసుకోవడంలేదని నిలదీశారు.
.
.
.
RevanthReddy: ప్రగతిభవన్ పేల్చేయాలా? రేవంత్ రెడ్డి బాంబ్!.. బూమరాంగ్?