Big Stories

Munnuru Kapu : కరీంనగర్‌లో ఒక వర్గానికి చెందినవారి మధ్య ఆసక్తికర పోరు!

Munnuru Kapu : కరీంనగర్ సెగ్మెంట్లో ఆసక్తికర పోటీ నెలకొంది. ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు నేతలు బరిలో నిలిచారు. దీంతో అక్కడ సీన్.. వెలమల ఇలాఖాలో మున్నూరు కాపులుగా మారింది. ఒకరు నాలుగోసారి, మరొకరు మూడోసారి.. ఉంకోకరు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో మున్నూరుకాపులు ఎవరి పక్షాన నిలుస్తారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

- Advertisement -

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పోరు.. మున్నూరుకాపు కులస్తుల ఫైట్‌గా మారింది. మూడు ప్రధాన పార్టీలు మున్నూరు కాపులకే టికెట్లు ఇచ్చాయి. బీఆర్ఎస్‌ నుంచి నాలుగోసారి గంగుల కమలాకర్‌ బరిలో నిలవగా.. బీజేపీ నుంచి మూడోసారి బండి సంజయ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మున్నూరు కాపు నేత, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వెలమల కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ఇప్పుడు మున్నూరు కాపుల ప్రాబల్యం పెరిగింది. అందుకే బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా మూడు పార్టీలు ఆ కులస్తులనే బరిలో నిలిపాయి. దీంతో ఇప్పుడు ఆ కులం ఓట్లు ఎవరిని ముంచుతాయి.. ఎవరిని తేలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

కరీంనగర్ నియోజకవర్గంలో 3 లక్షల 40 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో మున్నూరు కాపు, ముస్లిం ఓటర్లు ఉన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాపువాడ పేరుతో ఓ పెద్ద కాలనీనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మున్నూరు కాపుల ప్రాబల్యం చాలా ఎక్కువ. కరీంనగర్ సిటీలోని కార్ఖానాగడ్డ, ఫతేపుర, ముక్రంపుర, కశ్మీర్ గడ్డ, గోదాం గడ్డ, రోజ్ టాకీస్ ఏరియా, రేకుర్తి, కొత్తపల్లి మున్సిపాలిటీలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లే సుమారు లక్షకుపైగా ఉంటాయని అంచనా. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన గంగుల కమలాకర్‌కు 41 శాతం ఓట్‌ షేర్‌తో 80వేల 9 వందలకు పైగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌కు 33 శాతం ఓట్‌ షేర్‌తో 66వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు 20 శాతం ఓట్‌ షేర్‌తో 39వేల 5 వందల ఓట్లు దక్కించుకొని మూడో స్థానానికే పరిమితం అయ్యారు.

కరీంనగర్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఎక్కువసార్లు గెలిచింది వెలమ సామాజిక వర్గం నేతలే. 1957, 1967, 1972 సాధారణ ఎన్నికల్లో జువ్వాడి చొక్కారావు ఎమ్మెల్యేగా గెలవగా, 1962లో అలిగిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచారు. 1983లో కరణం సామాజిక వర్గానికి చెందిన కటకం మృత్యుంజయం, ఆ తర్వాత 1985లో వెలమ సామాజిక వర్గానికి చెందిన చల్మెడ ఆనందరావు, 1989లో వెలిచాల జగపతిరావు, 1994లో జువ్వాడి చంద్రశేఖర్ రావు, 1999లో కటారి దేవేందర్ రావు, 2004లో ఎమ్మెస్సార్ విజయం సాధించారు. 2009లో గంగుల కమలాకర్ గెలిచేంత వరకు ఇక్కడ నుంచి 1978లో ఒక్కసారి మాత్రమే నలమాచు కొండయ్య అనే బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు.

2009 నుంచి వరుసగా గంగుల కమలాకర్ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది మున్నూరు కాపులే. మంథని నుంచి పుట్ట మధు, రామగుండం నుంచి కోరుకంటి చందర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఇక, కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ఆది శ్రీనివాస్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు టికెట్లు కేటాయించింది. బీజేపీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌కు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌కు, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో బొమ్మా శ్రీరామ్ చక్రవర్తికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. మొత్తంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో గెలుపును డిసైడ్‌ చేసేది మాత్రం మున్నూరుకాపులు, ముస్లింలే. మరి ఈసారి గంగులకు పట్టం కడుతారా.. మార్పు కోరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News