E-Paper
Advertisement

Habsiguda Crime: నిర్లక్ష్యం.. స్కూల్ బస్ కింద పడి రెండేళ్ల పాప మృతి

Habsiguda Crime: నిర్లక్ష్యం.. స్కూల్ బస్ కింద పడి రెండేళ్ల పాప మృతి
Advertisement
Hyderabad latest news

Habsiguda Crime news(Hyderabad latest news):

హైదరాబాద్ హబ్సీగూడలోని రవీంద్రనగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెంచింది. తండ్రి, అమ్మమ్మతో కలిసి తన అన్నను స్కూల్ బస్ ఎక్కించేందుకు చిన్నారి జావ్లానా రోడ్డుమీదికి వచ్చింది. కొడుకును బస్సు ఎక్కించిన తండ్రి.. డ్రైవర్ తో మాట్లాడుతుండగా నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ.. అమ్మమ్మతో ఉన్న చిన్నారి పరుగులు తీసింది.

Advertisement

అదే సమయంలో డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి.. ముందుకి కదిలాడు. చిన్నారి జావ్లానా బస్సు టైర్ కిందపడి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఓయూ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారరు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ముద్దుగా ఉండే తమ పాప.. ఇక కళ్లముందు కనిపించదంటూ ఆ తల్లి పెట్టే శోకాలు స్థానికులచే కంటతడి పెట్టించాయి. కాగా.. నెలరోజుల వ్యవధిలోనే స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఖరీదు.. చిన్నారుల నిండు ప్రాణాలవుతున్నాయి.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×