E-Paper
Advertisement

Harish Rao: అబద్ధాల కాంగ్రెస్: హరీష్ రావు ఆగ్రహం

Harish Rao: అబద్ధాల కాంగ్రెస్: హరీష్ రావు ఆగ్రహం

 4000 పెన్షన్ ఇచ్చేదెప్పుడు?
– గురుకులాల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరా?
– చేయాల్సిన పని చేతగాక కేసీఆర్‌ను తిడతారా?
– కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు ఆగ్రహం
– హాలియా బీసీ గురుకుల పాఠశాల ఘటనపైనా ఫైర్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్‌లో పర్యటించిన ఆయన, కాంగ్రెస్ అబద్దాలతో ప్రజలను నమ్మించి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ 200 రూపాయల పింఛన్‌ను మొదటి నెలలోనే రూ.1000 కి పెంచారని, రెండోసారి అధికారంలోకి రాగానే 2,000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. పది నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 4000 రూపాయలు అందించలేకపోయిందని ఎద్దేవ చేశారు. గురుకులాల్లో పిల్లలు ఆగం అవుతున్నారని, పురుగుల అన్నం తినలేక రోడ్లపైకి వస్తున్నారని ఆరోపించారు. చేయాల్సిన పని చేతగాక, కేసీఆర్‌ని తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాటలు వింటే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమంటే నోరుపారేసుకోవడం కాదని విమర్శించారు. 16వ ఆర్థిక సంఘాన్ని కూడా సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో 6.85 లక్షల కోట్లు అప్పు ఉన్నట్టు శ్వేతపత్రం విడుదల చేశారని పేర్కొన్నారు. అందులో మార్చి 2024 వరకు కాంగ్రెస్ తీసుకుబోయే అప్పులను కూడా కలిపి చెప్పారని తీవ్ర ఆరోపణ చేశారు. గోబెల్స్‌ని మించిపోయి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ లో ఉన్నోళ్లు ఒక్కరోజు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదని చెప్పారు. తాము చేసిన మంచి పనులను సీఎం చెప్పడం లేదన్నారు హరీష్ రావు.

Also Read: Poonam Kaur: బ్రేకింగ్.. ఎట్టకేలకు త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసిన పూనమ్

మరీ ఇంత దారుణమా?

హైదరాబాద్, స్వేచ్ఛ: హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసనలకు సంబంధించి హరీష్ రావు, కేటీఆర్ ట్వీట్లు చేశారు. పరిపాలనను గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలే చేసే రేవంత్ రెడ్డికి గురుకుల బాలికల ఆవేదన వినిపించడం లేదా? అని అడిగారు. కేటీఆర్ స్పందిస్తూ, కుక్క‌ల క‌న్నా దారుణంగా చూస్తున్నారని, నిత్యం పురుగుల అన్నం తిన‌లేక‌, క‌డుపులు మాడ్చుకోలేక చ‌చ్చిపోతున్నారని అన్నారు. అడిగితే ప్రిన్సిపాల్ తిడుతున్నారంటున్న వారి ఆవేద‌న విన‌ప‌డుతోందా? అంటూ ఫైరయ్యారు. కేసీఆర్ ఎంతో నిండు మ‌న‌సుతో తెచ్చిన గురుకులాల‌పై ఎందుకింత క‌క్ష‌? రాజ‌కీయం చేయాల‌నుకుంటే మాతో చేయండి భ‌రిస్తాం కానీ ఇలా ప‌సి పిల్ల‌ల‌తో కాదు అంటూ మండిపడ్డారు కేటీఆర్.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×