Kaleshwaram Report: కాళేశ్వరం నివేదిక రద్దు పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి. గురువారం మధ్యాహ్నం కేసీఆర్-హరీష్‌రావు దాఖలైన పిటిషన్లపై వాదనలు మొదలయ్యాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్ తరఫు వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు న్యాయవాదులు సుందరం, శేషాద్రినాయుడు.
నోటీసులు సరైన విధానంలో కమిషన్ ఇవ్వలేదన్నారు. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్నారు. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని అన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ వ్యూహంతో కమిషన్ నియామకం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందని, వర్షాకాలంలో అకాల వర్షాల వల్లే జరిగిందన్నారు.
కుంగిపోవడానికి డిజైనింగ్- ఇంజనీరింగ్‌లతో ఎలాంటి సంబంధం లేదని ప్రస్తావించారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం ఏంటని న్యాయస్థానం ముందు వాదించారు. ప్రజల్లో తమ పరువు తీయాలని చూస్తున్నారని, అందువల్ల జస్టిస్ ఘోష్ నివేదిక రద్దు చేయాలన్నారు.
ALSO READ: కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి ఝలక్.. బీఆర్ఎస్ మద్దతు నో, షాకైన బీఆర్ఎస్
60 పేజీల నివేదిక పబ్లిక్ డొమైన్‌లో ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 8B , 8c కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు. మాకు కాపీ ఇవ్వకుండానే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. 600 పేజీల నివేదిక స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని త్రీ మెన్ కమిటీ వేసిందన్నారు. ఆ కమిటీ 60 పేజీల రిపోర్ట్ ఇవ్వలేదని న్యాయవాదులు చెప్పారు.
ఈ నివేదికను అడ్డు పెట్టుకుని అనేక చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మా మీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వం వ్యవహరించవచ్చన్నారు. ఈ నివేదిక పూర్తిగా పక్కన పెట్టాలని కోరారు. అందుకే కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతున్నాను. 60 పేజీలు రిపోర్ట్ మీకు వచ్చిందా అని పిటిషన్లకు ప్రశ్నలు వేసింది.
ఆ రిపోర్ట్ ఎక్కడ నుండి వచ్చింది? కేవలం 60 పేజీల నివేదిక మాత్రమే అప్లోడ్ చేశారన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఏజీకి మూడు ప్రశ్నలు సంధించింది. 60 పేజీల రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్టారా ? పిటిషనర్లకు 8బి నోటీసులు ఇచ్చారా లేదా ? కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటని అడిగింది. దీనిపై ఏజీ నోరువిప్పారు.
నోటీసులు ఇచ్చాకే కొన్ని కాపీలు ఇవ్వాలని కమిషన్‌కు కేసీఆర్ లేఖ రాశారని ఏజీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ రాసిన లేఖను న్యాయస్థానానికి అందజేశారు. కేసీఆర్ అడిగిన అన్ని కాపీలను ఇచ్చామని తెలిపారు. తాము ఏ 8 బి నోటీసు ఇచ్చామన్నారు. సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది 8 బి నోటీస్ కాకుండా ఉంటుందా అని అన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనన్నారు.
కిరణ్ బేడి కేసు-ఈ కేసుకు చాలా తేడాలున్నాయని, రిపోర్టును పబ్లిక్ డొమెన్లో పెట్టలేదన్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. కౌంటర్లో మరిన్ని వివరాలు పొందపరుస్తామన్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని హైకోర్టును కోరారు ఏజీ. అసెంబ్లీలో నివేదికపై చర్చించిన తర్వాత విచారణ చేపట్టాలని కోరారు. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత మళ్లీ వాదనలు సాగనున్నాయి.