BigTV English

Poonam Kaur: బ్రేకింగ్.. ఎట్టకేలకు త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసిన పూనమ్

Poonam Kaur: బ్రేకింగ్.. ఎట్టకేలకు త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసిన పూనమ్

Poonam Kaur:  టాలీవుడ్ లో లైంగిక వేధింపుల కేసు ఉన్నకొద్దీ  హీట్ ఎక్కుతుంది. నిన్నటికి నిన్న జానీ మాస్టర్ పై జూనియర్ డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.  తననులైంగికంగా  వేధిస్తున్నాడు అని,  అతని భార్య మతం మార్చుకోమని టార్చర్ చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై TFCC  ఒక ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేసింది.


ఇంకెవరైనా ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడితే తమకు చెప్పొచ్చు అని అని చెప్పిన కొద్దీ నిమిషాల్లోనే  నటి పూనమ్ కౌర్ పెద్ద బాంబ్ పేల్చింది. పూనమ్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందు దొరికినప్పుడల్లా.. పవన్ కళ్యాణ్ పై, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆమె విరుచుకుపడుతూనే ఉంటుంది.

ముఖ్యంగా డైరెక్టర్  త్రివిక్రమ్ పై ఆమె విమర్శలు చేయడం కొత్త కాదు. అయితే  ఎప్పుడు కూడా  డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరును ఉపయోగించలేదు. గతంలో ఆమె అతడిపై మా అసిసియేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కేసు హీట్ ఎక్కించడంతో మరోసారి పూనమ్.. తన ఫిర్యాదు గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఈసారి మాత్రం త్రివిక్రమ్ పేరును డైరెక్ట్ గా ప్రస్తావించడం విశేషం.


త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మా అసోసియేషన్ లో  ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ, నాలా చాలామందికి రాజకీయ  బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో నా ఫిర్యాదును వారు తిరస్కరించారు.  ఆ తరువాత కూడా నేను పెద్దలకు ఫిర్యాదు చేశాను. వాళ్లు కూడా నన్ను సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఇప్పుడైనా దర్శకుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను  కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.  మరి ఈ వివాదం ఎక్కదవరకు యెల్లి ఆగుతుందో చూడాలి.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×