BigTV English

OTT Movie : ఏఐతో ప్రేమ… అంత్యక్రియల కోసం వెళ్తే అంతు చిక్కని మిస్టరీ… మైథలాజికల్ స్టోరీలో మతిపోగోట్టే ట్విస్ట్.

OTT Movie : ఏఐతో ప్రేమ… అంత్యక్రియల కోసం వెళ్తే అంతు చిక్కని మిస్టరీ… మైథలాజికల్ స్టోరీలో మతిపోగోట్టే ట్విస్ట్.

OTT Movie : సినిమాలకు మించిన థ్రిల్ ను ఇస్తున్నాయి వెబ్ సిరీస్ లు. కొత్త కంటెంట్ ను పోటీ పడి, ఓటీటీ సంస్థలు సొంతం చేసుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే, భాషానుకూడా పట్టించుకోవట్లేదు ఆడియన్స్. ఏ భాషలో ఉన్నా, నచ్చిన సిరీస్ ను నెత్తిన పెట్టుకుని మరీ చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సై-ఫై థ్రిల్లర్ సిరీస్ ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇది తమిళ సిరీస్‌లలో న్యూ కాన్సెప్ట్‌గా బజ్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ హిందూ పురాణాలు, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేస్తూ, ఐదవ వేదం రహస్యాల చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథనాన్ని అందిస్తుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

అను అనే యువతి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆమె తన తల్లి అంత్యక్రియల కోసం వారణాసి వెళ్తుంది. అక్కడ ఒక సాధువు ఆమెకు ఒక పురాతన పెట్టెను అప్పగిస్తాడు. దానిని తమిళనాడులోని అయ్యంగరపురం అనే గ్రామంలోని ఒక పూజారికి అందజేయమని కోరతాడు. ఈ పెట్టె ఐదవ వేదం రహస్యాలను వెలికితీసే కీలకమైన పురాతన వస్తువును కలిగి ఉందని తెలుస్తుంది. ఇందులో సృష్టి రహస్యాలు ఉంటాయని భావిస్తారు. అను ఒక హిప్పీ సింగర్. మొదట ఈ బాధ్యతను తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకు సింగింగ్ ఆడిషన్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. అయితే విధి ఆమెను అయ్యంగరపురం వైపు నడిపిస్తుంది. ఇక్కడ ఆమెకు కొన్ని పాత్రలు పరిచయం అవుతాయి. అక్కడ ఆమె ఊహించని సంఘటనలను ఎదుర్కొంటుంది.


ఈ ప్రయాణంలో మిథ్రన్, రాధిక అనే AIతో అనుని కలుస్తాడు. పతి అనే ఫోటోగ్రాఫర్, బ్రహ్మ గురించి పురాతన రైటింగ్స్ డీకోడ్ చేస్తూ అదే ఊరికి వస్తాడు. కేతకి అనే లాయర్, బయోఇంక్ 3D ప్రింటర్ థెఫ్ట్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ వస్తుంది. అయ్యంగరపురంలో Y.G. మహేంద్రన్ (పాత పూజారి), ఇంకా ఫాదర్-డాటర్ డుయో, ఆటిస్టిక్ చైల్డ్‌ను కలుస్తారు. ఈ చైల్డ్ పురాతన భాషను రీడ్ చేయగలడు. 1970ల్లో ఆర్కియాలజిస్ట్స్ ఐదవ వేదం గురించి స్క్రిప్ట్ డిగ్ చేసిన ఫ్లాష్‌బ్యాక్స్ చూపిస్తారు. ఐదవ వేదం సృష్టి రహస్యాలను అన్‌లాక్ చేస్తుందని, నాలుగు ప్లానెట్స్ అలైన్ అయినప్పుడు రివీల్ అవుతుందని తెలుస్తుంది. అను, మిథ్రన్, పతి, కేతకి ట్రాక్స్ అయ్యంగరపురంలో కన్వర్జ్ అవుతాయి. కానీ మాలివోలెంట్ ఫోర్సెస్, AI డామినెన్స్ వాళ్లను అడ్డుకుంటాయి. క్లైమాక్స్ ఓపెన్-ఎండెడ్ తో, సీజన్ 2కి హింట్ ఇస్తూ సస్పెన్స్‌తో ముగుస్తుంది.

ఏ ఓటీటీ ఉందంటే

‘ఐంధం వేదం’ (Aindham Vedham) 2024లో విడుదలైన తమిళ సై-ఫై మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని నాగ (మర్మదేశం టెలివిజన్ సిరీస్ దర్శకుడు) రూపొందించారు. ఈ సిరీస్‌లో సాయి ధన్షికా ప్రధాన పాత్రలో నటించగా, శాంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, కృష కురుప్, రామ్జీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సిరీస్ ZEE5లో 2024 అక్టోబర్ 25న తమిళం, తెలుగు వెర్షన్‌లలో విడుదలైంది. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లతో రూపొందింది. దాని ఓపెన్-ఎండెడ్ క్లైమాక్స్ సీజన్ 2కి మార్గం సుగమం చేస్తుంది. ఇది IMDbలో 7.8/10 రేటింగ్ ను పొందింది. JioTV, Airtel Xstream Playలో కూడా స్ట్రీమింగ్‌లో ఉంది.

Read Also : మజా ఇచ్చే రాజకీయాలు… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులున్న హిందీ డార్క్ కామెడీ – క్రైమ్ డ్రామా

Related News

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

Big Stories

×