Annamaya District: ఏపీలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజంపేట మండలంలో బాలరాజుపల్లి, చెయ్యేరులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతిచెందగా.. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులని పోలీసులు తెలిపారు.
మృతుల పేర్లు దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిన్న కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందని విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన మరవకు ముందే ఈ రోజు మరో ముగ్గురు యువకులు మృతిచెందగా.. ఓ వ్యక్తి గల్లంతయ్యారు.
నిన్న కర్నూల్ జిల్లా చిగిలి గ్రామంలోని నీటికుంటలో ఆరుగురు ఐదో తరగతి విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్లి ఊపిరాడక మృతిచెందారు. అయితే పిల్లలు అందరూ ఒకేసారి కుంటలోకి దిగారు. ఆ నీటకుంట లోతు తెలియక పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే రక్షంచే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ఐదో తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ పిల్లలకు ఈత రాకపోవడం వల్లే మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఆరుగురు చిన్నారులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ALSO READ: Jonnagiri: అదృష్టమంటే ఈమెది.. రూ.300 కూలికి పోతే.. రూ.40లక్షల వజ్రం దొరికింది..!