BigTV English

Job guarantee courses: ఇంటర్, డిగ్రీ అవసరం లేదు.. పదో తరగతి తర్వాతే డైరెక్ట్ జాబ్.. ఇలా చేయండి!

Job guarantee courses: ఇంటర్, డిగ్రీ అవసరం లేదు.. పదో తరగతి తర్వాతే డైరెక్ట్ జాబ్.. ఇలా చేయండి!

Job guarantee courses: పదో తరగతి పూర్తయిన తర్వాత ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారా? ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుల మధ్యలో ఏదో కారణంతో ఆపేసారా? ఇక టెన్షన్ అవసరం లేదు! తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మీకో సూపర్ ఛాన్స్ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యాలను పెంచే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసింది. ఇవి పూర్తిగా ఉచితం, అంతేకాదు ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి 100 శాతం ఉద్యోగ హామీ కూడా ఉంది.


తెలంగాణ ప్రభుత్వం, టాటా గ్రూప్ కలసి దాదాపు రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా 65 ATCs ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్న ఈ సెంటర్లు పదో తరగతి పాస్ అయిన ప్రతీ ఒక్కరికీ ఓ సరికొత్త భవిష్యత్తును అందిస్తాయి.

ట్రైనింగ్ వేరే లెవెల్
ఇప్పుడు పరిశ్రమలు కోరుతున్న స్కిల్స్ నేర్పించడమే ఈ కోర్సుల ప్రధాన లక్ష్యం. రెండు సంవత్సరాల కోర్సులు నుంచి ఒక సంవత్సరపు షార్ట్‌టర్మ్ ప్రోగ్రామ్‌ల వరకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కంపెనీల్లో నేరుగా ప్లేస్‌మెంట్లు లభిస్తాయి. శిక్షణలో ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆన్-జాబ్ ట్రైనింగ్, స్టైపెండ్ సపోర్ట్ కూడా లభిస్తాయి.


రెండు సంవత్సరాల కోర్సులు ఇవే..
అడ్వాన్స్‌డ్ CNC మెషినింగ్ టెక్నీషియన్
ఈ కోర్సు ద్వారా విద్యార్థులు CNC మెషిన్లలో ఆపరేటర్, ప్రోగ్రామర్‌లుగా తయారవుతారు. మాస్టర్ క్యామ్ సాఫ్ట్‌వేర్, FANUC, SIEMENS, HASS వంటి అంతర్జాతీయ CNC కంట్రోలర్లపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. కోర్సు పూర్తయిన వెంటనే ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఖాయం.

మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ (EV)
భవిష్యత్తు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ కోర్సులో రెండు సంవత్సరాలు శిక్షణ పొంది, EV టెక్నాలజీ, ట్రబుల్‌షూటింగ్, రిపేర్స్ అన్నింటినీ నేర్చుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి టాప్ EV కంపెనీల్లో నేరుగా ఉద్యోగాలు వస్తాయి.

బేసిక్ డిజైనర్.. వర్చువల్ వెరిఫయర్
ప్రొడక్ట్ డిజైనింగ్ నుంచి మోడలింగ్ వరకు ఈ కోర్సు ట్రైనింగ్ ఇస్తుంది. ANSYS, CAE, CAD/CAM లాంటి సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం సంపాదిస్తారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్ రంగాల్లో ఉద్యోగాలకు ఇది గేట్‌వే లాంటిది.

ఒక సంవత్సరపు కోర్సులు ఇవే..

ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్
3D ప్రింటర్, CNC టూల్‌రూమ్ లేథ్, లేజర్ కట్టర్ వంటి అత్యాధునిక పరికరాలపై ట్రైనింగ్ ఇస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ప్యాకేజింగ్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉంటాయి.

ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్
పరిశ్రమల్లో పనులను వేగంగా పూర్తి చేయడానికి రోబోటిక్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తుంది. రోబోటిక్ మెషిన్ల ప్రోగ్రామింగ్, ఆటోమేటిక్ వెల్డింగ్, అసెంబ్లీ లైన్ ఆటోమేషన్ వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు. ఆటోమొబైల్, తయారీ రంగాల్లో దీనికి పెద్ద డిమాండ్ ఉంది.

మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్
PLC, SCADA, HMI వంటి కీలక ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం సంపాదించవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్యాకేజింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఖాయం.

Also Read: AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

అడ్మిషన్ల ప్రక్రియ
దరఖాస్తు చేయడం చాలా సులభం. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://iti.telangana.gov.in/ లో ఆన్‌లైన్ అప్లికేషన్ నింపాలి. తర్వాత మీకు దగ్గరలోని ప్రభుత్వ ITI లేదా ATCకి వెళ్లి అప్లికేషన్ సమర్పించాలి. వెంటనే అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.

చివరి తేదీ
ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 08069434343 నంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే 9703331914 వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపవచ్చు.

అవసరమైన పత్రాలు ఇవే..
పదో తరగతి సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), బోనోఫైడ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం

ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. పదో తరగతి తర్వాత సాంకేతిక రంగంలో మీ కెరీర్‌ను బలంగా ప్రారంభించుకోవాలనుకుంటే, తెలంగాణ ATCs మీకో బంగారు అవకాశం ఇస్తున్నాయి. ఉచితంగా ఇంజినీరింగ్ లెవల్ ట్రైనింగ్‌తో పాటు 100 శాతం ప్లేస్‌మెంట్ హామీతో మీ భవిష్యత్తు ఇక్కడే సెట్ అవుతుంది.

Related News

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా హర్పాల్ సింగ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Govt savings plan: మీ పాప పేరు మీద ఈ స్కీమ్‌లో ఇంత పెట్టుబడి పెడితే.. పెళ్లికి సుమారు రూ.72 లక్షలు మీ చేతికి!

TG High Court: రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్.. నివేదక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై పిటిషన్.. కోర్టులో వాడివేడి వాదనలు, తీర్పు ఎటు?

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌కు కిషన్‌‌రెడ్డి ఝలక్.. బీఆర్ఎస్ మద్దతు నో, షాకైన బీఆర్ఎస్

Big Stories

×