OTT Movie : డ్రగ్ మాఫియా, రాజకీయ అవినీతి నేపథ్యంలో ఒక బెంగాలీ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. సినిమాటోగ్రఫీ, నటన, సంగీతం కారణంగా ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇది “హోయ్‌చోయ్ వరల్డ్ క్లాసిక్స్” లైబ్రరీలో మొదటి సిరీస్ గా గుర్తించబడింది. అంతేకాకుండా 2022 హోయ్‌చోయ్ అవార్డ్స్ లో Best Series, Best Actress (సోహినీ సర్కార్) నామినేషన్స్, Best Supporting Actor (దేబాశిష్ మొండల్) అవార్డ్స్ కూడా గెలిచింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
ఈ కథ పశ్చిమ బెంగాల్‌లోని మెదినీపూర్ జిల్లాలోని గీల్‌పూర్ అనే తీరప్రాంత గ్రామంలో జరుగుతుంది. మందార్ గీల్‌పూర్‌లో డబ్లు భాయ్ అనే శక్తివంతమైన డ్రగ్ లార్డ్‌కు నమ్మకమైన అనుచరుడు. మందార్ ఒక బలమైన వ్యక్తి, అతను తన భార్య లైలీతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. అయితే అతని వ్యక్తిగత జీవితంలో ఒక లోపం అతన్ని బాధిస్తుంది. అతను పైకి చాలా బలంగా కనిపిస్తాడు. కానీ రాత్రయితే భార్యతో గడపడానికి స్టామినా లేక సతమతమవుతుంటాడు. తన అసమర్థతకి బాధపడుతుంటాడు. ఇది లైలీని కూడా బాధపెడుతుంది. ముఖ్యంగా సంతానం కావాలనే కోరిక అతను నెరవేర్చలేకపోతాడు. ఈ లోపం మందార్‌ను లైలీ పట్ల లొంగిపోయే వైఖరిని కలిగిస్తుంది. ఆమె అతని బలహీనతలను ఉపయోగించుకుని, అధికారం, ఆధిపత్యం కోసం పాకులాడుతుంది.
డబ్లు భాయ్ తన అధికారానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను అణచివేయమని మందార్‌ను ఆదేశిస్తాడు. ఈ పనిని పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు, మజ్ను బురి అనే మాంత్రిక స్త్రీని మందార్ కలుస్తాడు. ఆమె అతని భవిష్యత్తును గురించి ఒక రహస్యం చెబుతుంది. అతను గీల్‌పూర్‌ను పాలించే అధికారంలోకి వస్తాడని అతనితో అంటుంది. ఈ మాటలు మందార్ మనస్సులో ఆశలను రేకెత్తిస్తుంది. లైలీ ఈ ఆలోచనను మరింత రెచ్చగొట్టి, డబ్లు భాయ్‌ను హత్య చేసి అతని స్థానాన్ని పొందామని మందార్‌ను ప్రేరేపిస్తుంది. లైలీ అధికార దాహం, మందార్ లైంగిక అసమర్థత వల్ల కలిగే సిగ్గు కలిసి, అతన్ని ఒక క్రూరమైన నిర్ణయం వైపు నడిపిస్తాయి.
మరోవైపు డబ్లు భాయ్‌తో లైలీ శారీరక సంబంధం కలిగి ఉంటుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఆ ప్రాంతాన్ని ఏలాలని ఉంటుంది. మందార్ ని లైలీ రెచ్చగొట్టడం, మజ్ను బురి మాటలు, లైలీ అతనితో అక్రమ సంబంధం ఇవన్నీ మందార్ ని ప్రభావితం చేయడంతో డబ్లు భాయ్‌ను హత్య చేస్తాడు. ఆతరువాత గీల్‌పూర్ డ్రగ్ ఆపరేషన్‌ల నాయకుడిగా స్థానం సంపాదిస్తాడు. అయితే అధికారం సాధించిన తర్వాత, మందార్ లైలీ పారనాయిడ్‌గా మారతారు. వాళ్ళ చర్యలతో అపరాధ భావన, శత్రువుల భయంతో బాధపడతారు.
ముఖద్దర్ ముఖర్జీ అనే ఒక అవినీతి పోలీసు అధికారి, గీల్‌పూర్‌లోని అధికార డైనమిక్స్‌ను పరిశీలిస్తూ కథలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇప్పుడు మందార్, లైలీ చర్యలు గీల్‌పూర్‌లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇక్కడ మరింత హింసకి దారితీస్తుంది. మందార్ మరిన్ని హత్యలు చేస్తాడు. అతను తన అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. మందార్ చీకటి రాజ్యానికి అధిపతి అవుతాడా ? ఆ చీకట్లోనే కలసిపోతాడా ? లైలీ పరిస్థితి ఏమవుతుంది ? పోలీసుల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘మందార్’ (Mandaar) 2021లో విడుదలైన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని అనిర్బన్ భట్టాచార్య, ప్రతీక్ దత్తా సృష్టించారు. ఈ సిరీస్ విలియం షేక్స్‌పియర్ మాక్‌బెత్ నాటకం ఆధారంగా ఒక లూస్ అడాప్టేషన్‌గా రూపొందింది. అనిర్బన్ భట్టాచార్య దర్శకత్వంలో తొలి ఒటిటి ప్రాజెక్ట్‌గా గుర్తించబడింది. ఈ సిరీస్‌లో సోహినీ సర్కార్ లైలీ (లేడీ మాక్‌బెత్‌గా), దేబాసిష్ మొండల్ మందార్ (మాక్‌బెత్‌గా), దేబేష్ రాయ్ చౌదరి డబ్లు భాయ్ (కింగ్ డంకన్‌గా) ప్రధాన పాత్రల్లో నటించారు. అనిర్బన్ భట్టాచార్య, ముఖద్దర్ ముఖర్జీ అనే అవినీతి పోలీసు అధికారిగా నటించారు. ఈ సిరీస్ హోయ్‌చోయ్ ప్లాట్ ఫామ్‌లో 2021 నవంబర్ 19న విడుదలైంది. ఈ సిరీస్ ఐదు ఎపిసోడ్‌లతో, IMDbలో 8.2/10 రేటింగ్ ను పొందింది. హోయ్‌చోయ్, జీ 5, ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ప్రియురాలితో ఉండగానే పరలోకానికి… IMDbలో 7.4 రేటింగ్… మలయాళ మిస్టరీ థ్రిల్లర్