E-Paper
Advertisement

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..
Advertisement

Hyderabad : హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆరేళ్ల వివేకానంద పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోపే బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఎస్ఐ దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల సికింద్రాబాద్ లో మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో బాలుడు నీటి గుంతకు బలైపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×