BigTV English

BJP: బండి సంజయ్ ఒంటరివాడా? అందరివాడా?

BJP: బండి సంజయ్ ఒంటరివాడా? అందరివాడా?

BJP News Telangana(Bandi Sanjay Latest News): తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌ ఒంటరైపోయారా? రాష్ట్ర నేతలు సంజయ్‌ని కావాలనే కార్నర్‌ చేస్తున్నారా? హైకమాండ్‌ ఆశీస్సులు ఉన్నా సంజయ్‌పై వ్యతిరేకతకు కారణమేంటి? రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్‌ చేస్తే.. పరామర్శకు వెళ్లే తీరిక కూడా రాష్ట్ర నేతలకు లేదా? కరీంనగర్లో అంత రచ్చ జరిగితే అగ్రనేతలంతా హైదరాబాద్ దాటి ఎందుకు కదల్లేదు? ఇంత వ్యతిరేకతతో బండి సంజయ్‌ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు?


బీజేపీ హైకమాండ్‌ బండి సంజయ్‌కి ఫుల్‌ పవర్స్‌ ఇచ్చింది. దూకుడుగా వెళ్లండి మేం చూసుకుంటాం అన్నది అగ్రనేతల మాట. తెలంగాణకు వచ్చినప్పుడల్లా అటు మోదీ.. ఇటు అమిత్‌ షా.. ఇద్దరూ సంజయ్‌ని అభినందిస్తూ.. ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రతీ మీటింగ్‌లోనూ సంజయ్‌పై ప్రశంసలు. ఇంతవరకు బాగానే ఉంది.. ఐతే.. సంజయ్‌కి హైకమాండ్‌ ఇస్తున్న ప్రాధాన్యతను ఆ పార్టీలోని నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారని టాక్‌. లోలోపల రగిలిపోతున్నారు. ఇది గమనించిన బీజేపీ హైకమాండ్‌ సదరు నేతల్ని ఢిల్లీకి పిలిపించుకుని మరీ క్లాస్‌ పీకింది. బండి సంజయ్‌కి సపోర్ట్‌గా నిలవాలని ఆదేశించింది. అయినాగానీ రాష్ట్ర కమలం నేతల్లో మార్పు వచ్చినట్లు కనిపిండం లేదు.

ఈమధ్యే టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో బండి సంజయ్‌ అరెస్టయ్యారు. అర్ధరాత్రి హడావిడిగా ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఊరూరు తిప్పారు. మూడు నాలుగు రోజులపాటు కరీంనగర్‌ జైలులో కూడా ఉన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ నేతలంతా సైలెంట్‌గా ఉండిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జైలుకు వెళ్లి సంజయ్‌ని పరాశమర్శించడం.. కుటుంబాన్ని ఓదార్చడం లాంటి కార్యక్రమాలేవీ చేపట్టలేదు. కనీసం కార్యకర్తలతో మీటింగ్‌ పెట్టి భోరోసా కల్పించే ప్రయత్నాలు కూడా జరగలేదు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ ఇలా చాలామంది నేతలు హైదరాబాద్‌లోనే ఉండి ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు తప్ప కరీంనగర్‌ వెళ్లలేదు. కనీసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అయినా కరీంనగర్‌ వెళ్లి మద్దతు తెలిపితే బాగుండేదని సంజయ్ అనుచరుల అభిప్రాయం. చివరి రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఒక్కరే సంజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×