E-Paper
Advertisement

యాపిల్‌కి చెక్ పెట్టిన శాంసంగ్ ఫోల్డబుల్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న Galaxy Z Fold 8!

యాపిల్‌కి చెక్ పెట్టిన శాంసంగ్ ఫోల్డబుల్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న Galaxy Z Fold 8!
Advertisement

Samsung Galaxy Z Fold 8: టెక్ ప్రపంచంలో యాపిల్ ఎంట్రీ ఇస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫోల్డబుల్ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ డ్యూయో రాకతో అంతా శాంసంగ్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ, సౌత్ కొరియా మార్కెట్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. యాపిల్ కొత్త ఫోన్ల లాంచ్ తర్వాత శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అమ్మకాలు ఏకంగా 10 శాతం వరకు పెరిగాయి. మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ శాంసంగ్ తన సత్తా చాటుకుంటోంది.

ధరే ప్రధాన కారణమా?

స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు అందరూ ముందుగా చూసేది ధర గురించే. సౌత్ కొరియాలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ధర సుమారు రూ.1,57,800 ఉండగా,.. యాపిల్ ఐఫోన్ డూయో ధర సుమారు రూ.2,27,700 వరకు ఉంటుందని అంచనా. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఈ ధరల మధ్య చాలా పెద్ద వ్యత్యాసమే ఉంటుంది. ఈ భారీ తేడాతో టెక్ ప్రియులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా శాంసంగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది.

Advertisement

Also Read: భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!

అందుబాటులో ఉండటంతో..

ఎంత మంచి ఫోన్ ఉన్నా సరైన సమయంలో చేతికి అందకపోతే కస్టమర్లు వేరే ఆప్షన్ వెతుక్కుంటారు. ఇప్పుడు శాంసంగ్ విషయంలో అదే జరిగింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఇప్పటికే మార్కెట్లో దొరుకుతుండగా.. యాపిల్ ఫోన్ మాత్రం అక్టోబర్ 16 వరకు లాంచ్ కాదు. దీంతో కొత్త ఫోన్ వెంటనే కావాలనుకునే వారు ఆలోచించకుండా శాంసంగ్ కొనేస్తున్నారు. ఈ గ్యాప్ శాంసంగ్‌కు బాగా కలిసి వచ్చింది.

సన్నని డిజైన్, అదిరిపోయే ఫీచర్లు..

Advertisement

పాత మోడళ్లతో పోలిస్తే.. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ చాలా సన్నగా, బరువు తక్కువగా వస్తోంది. చేతిలో పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండటంతో రోజువారీ వాడకానికి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తోంది. ఇందులో 7.6 అంగుళాల మెయిన్ స్క్రీన్, బయట 5.5 అంగుళాల కవర్ డిస్ప్లే ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండటం వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతాయి. ఫోటోల కోసం రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో పాటు 4800mAh బ్యాటరీని అమర్చారు.

పోటీ ఎలా ఉంటుందంటే?

మార్కెట్లో పోటీ పెరిగినంత మాత్రాన బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా మారిపోదు. శాంసంగ్ చాలా కాలంగా ఈ రంగంలో ఉంది కాబట్టి.. కస్టమర్లకు ఈ డిజైన్ అలవాటైపోయింది. అక్టోబర్‌లో యాపిల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చాక అసలు పోటీ ఎలా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సొంత గడ్డపై శాంసంగ్ జోరు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేదేలే అంటోంది.

Also Read: బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

Tags

Related News

చేయి ఊపితే చాలు ఆన్ అయిపోయే చిమ్నీలు! ఇండియన్ కిచెన్స్‌కు ఇవి పర్ఫెక్ట్!

రూ.36,000 లోపు ఏఐ టెక్నాలజీతో సూపర్ ల్యాప్‌టాప్ లాంచ్.. ఫీచర్స్ అదిరిపోయాయ్!

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!

రీఛార్జ్ బాదుడుకి చెక్.. కేంద్రం సంచలన నిర్ణయం.. దెబ్బకు దిగిరానున్న ప్లాన్ల ధరలు!

Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!

ఆడవాళ్ల మనసు దోచే టైటాన్ వాచ్‌లపై..30% డిస్కౌంట్!

హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై..40% డిస్కౌంట్!డోంట్ మిస్

Big Stories

Advertisement
×