Dundigal Police: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి భారీగా గంజాయి బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠా గుట్టును కుత్బుల్లాపూర్ జోన్ పోలీసులు రట్టు చేశారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆపరేషన్
విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద నిఘా తీవ్రతరం చేశారు. ఆ సమయానికి అనుమానాస్పదంగా వస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. వాహనంలో దాచి ఉంచిన దాదాపు 425 కిలోల గంజాయిని చూసి అధికారులు సైతం షాక్‌కి గురయ్యారు.
ఆరుగురు అరెస్టు.. వాహనం సీజ్
ఈ ఆపరేషన్‌లో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన డీసీఎం వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మధ్యవర్తుల కోసం ముమ్మర గాలింపు
ఒడిశా సరిహద్దుల నుంచి ఈ స్థాయిలో గంజాయి ఎలా దాటుకుని వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక అంతర్‌రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందా, స్థానికంగా ఎవరైనా సహకరించారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు.
Also Read: 2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ