BigTV English

Woman Murdered Husband: భర్తను చంపేసి హార్ట్ ఎటాక్ అంటూ నాటకమాడిన భార్య.. తీరా చూస్తే..!

Woman Murdered Husband: భర్తను చంపేసి హార్ట్ ఎటాక్ అంటూ నాటకమాడిన భార్య.. తీరా చూస్తే..!

Hyderabad Woman Masks Husband’s Murder: పచ్చని ఫ్యామిలీలో అక్రమ సంబంధాలు చిచ్చురేపు తున్నాయి. క్షణికావేశంలో ప్రియుడు మోజులోపడి కట్టుకున్న భర్తను కడతేర్చిన ఉదంతాలు కోకొల్లలు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తని దారుణంగా చంపేసింది కసాయి ఇల్లాలు. భర్త డబ్బులతో ఎంజాయ్ చేయాలని అనుకుందామె. అనుకోని పరిస్థితుల్లో అడ్డంగా బుక్కై ఊచలు లెక్కిస్తోంది.


సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చోటుచేసుకుంది. అసలు స్టోరీలోకి వెళ్తే.. ఎల్లారెడ్డి‌గూడలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు విజయ్‌కుమార్-శ్రీలక్షి. భర్త టెక్నీషియన్ కాగా, వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. విజయ్‌కు మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలోని సొంత ఇళ్లు ఉన్నాయి. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. మ్యారేజ్‌కు ముందు శ్రీలక్షి బోరబండకు చెందిన రాజేశ్వర్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది.

భర్త ఆస్తితో ఎంజాయ్ చేయవచ్చని ప్లాన్ గీసుకుందామె. తమ ఆనందానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి, ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. ఇందుకోసం సనత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకుంది. ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి అపార్ట్‌మెంటుకు మకాం మార్చింది శ్రీలక్షి.


Also Read: Man kills Mother and Daughters : ఆస్తి తగాదా.. తల్లి, కూతుళ్లను చంపిన కిరాతకుడు

సరిగ్గా ఫిబ్రవరి ఒకటిన విజయ్‌కుమార్ తన పిల్లలను స్కూల్‌ వద్ద దింపి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే ప్రియుడు సహా మిగతా వ్యక్తులను ఇంటికి పిలిపించిందామె. విజయ్ ఇంట్లోకి రాగానే గడియపెట్టింది. అప్పటికే ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో విజయ్‌పై దాడి చేశారు. తనను చంపవద్దని ప్రాధేయపడినా ఆమె మనసు కరగలేదు. చివరకు దారుణంగా కొట్టి చంపేశారు. మృతదేహాన్ని బాత్ రూమ్‌లో పడేసి వెళ్లిపోయారు. అక్కడితో గ్యాంగ్ పనైపోయింది.

ఈ వ్యవహారాన్ని శ్రీలక్ష్మి చాలా జాగ్రత్తగా నడిపింది. మూడో కంటికి విషయం తెలియకుండా డ్రామా ఆడింది. రక్తపు మరకలు తుడిచేసింది. భర్త దుస్తులు మార్చి గుండెపోటుతో చనిపోయాడని బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లని నమ్మించింది. విజయ్ మృతదేహానికి అంత్యక్రియులు చేశారు. ఆధారాలు బయటకు తెలీకుండా జాగ్రత్త పడింది. న్యాయం ఎక్కడైనా గెలుస్తుందని చెప్పడానికి ఇక్కడో ఉదాహరణ.

Also Read: రేవంత్ కేబినెట్ విస్తరణ, వాళ్లకే ఛాన్స్!

సరిగ్గా మూడునెలల తర్వాత నిందితుడు రాజేశ్వర్‌రెడ్డి నేరుగా పోలీసుస్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పు కొచ్చాడు. విజయ్ చనిపోలేదని, తామే చంపామని వివరించాడు. విజయ్‌ను హత్య చేసిన నుంచి తనకు మనశ్శాంతి లేదని చెప్పుకొచ్చాడు. నిందితుడు సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేష్, బబ్బన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. అందరినీ పొగొట్టుకుని ఒంటరైంది ఆ కసాయి ఇల్లాలు.

Tags

Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×