Birth Certificate: బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ జారీ చేసి తమ పనితనం చూపించారు ఖమ్మం జిల్లా అధికారులు. బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్ ఇచ్చారు కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది. చేసిన తప్పును సదరు సెక్షన్ అధికారి సరిదిద్దుకోకుండా తమపైనే ఎదురుదాడి చేశాడని బాధితులు వాపోతున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి తాహసీల్దార్ సిబ్బంది నిర్వాకం
కూసుమంచి మండలం మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, మమత దంపతులు తమ కూతురు మాద విద్య జనన సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు లేనందున తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి చెప్పారు. దీంతో బాలిక తల్లితండ్రులు గత ఏడాది డిసెంబరు 17న బాలిక జనన సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో చలానా కట్టారు.
ప్రశ్నించిన బాధితులపై దుర్భాషలాడిన సెక్షన్ అధికారి
అప్పటి నుంచి జతపర్చిన ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవంటూ కాలాయాపన చేశారు. అనంతరం ఆగస్టు నాలుగో తేదీన సర్టిపికెట్ చేతికందించారు. బాలిక తల్లి పరిశీలించగా బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ జారీచేసినట్లు గమనించింది. ఇదేంటని ప్రశ్నించడంతో వెంటనే సెక్షన్ ఆఫీసర్ ఆ పత్రాన్ని లాక్కొని చింపివేశారు. డెత్ సర్టిఫికెట్ బదులు మళ్లీ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ అందులో కూడా ఎక్కడ డెలివరీ అయిన వివరాలు లేకపోవడంతో.. హాస్పిటల్ వివరాలు నమోదు చేయాలని అడగ్గా దుర్భాషలాడాడు. దీంతో వారు తహసీల్దారును కలిసేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు.
సర్టిఫికెట్ జారీ చేసిన కూసుమంచి తహసిల్దార్
ఈ ఘటనపై తహసీల్దార్ రవికుమార్‌ను వివరణ కోరగా తాను కార్యాలయానికి రాలేదని, కోర్టు పనిమీద హైదరాబాద్ వెళ్లానని తెలిపారు. బాలిక తల్లితండ్రులు ఫోన్లో విషయం తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. పొరపాటు జరిగితే సరి చేసి బర్త్ సర్టిఫికెట్ తిరిగి జారీ చేస్తామని కూసుమంచి మండల తహసిల్దార్ తెలిపారు.
బర్త్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తే.. మరణ ధ్రువీకరణ పత్రం జారీ..
ఖమ్మం జిల్లా కూసుమంచి తహసిల్దార్ కార్యాలయంలో ఘటన
ప్రశ్నించిన బాధితులపై దుర్భాషలాడిన సెక్షన్ అధికారి
తమ కుమార్తె జనన ధృవీకరణ పత్రం కోసం 6 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్న గట్టు సింగారం గ్రామానికి చెందిన కడారి… pic.twitter.com/8TjuEpdkTA
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2025