BigTV English

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Unhygienic Street Food Viral Video: ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి భోజనం చేయాలని అందరూ చెప్తుంటారు. కానీ, ఇంట్లో ఫుడ్ కంటే బయటి ఫుడ్ టేస్టీగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అందుకే, ఆఫీస్ అయ్యాక ఇంటికి చేరే ముందు స్ట్రీట్ ఫుడ్ బండ్ల దగ్గర ఆపి.. అక్కడి ఫుడ్స్ లొట్టలేసుకుని తినేస్తారు. రుచిగా ఉందా? లేదా? అని మాత్రమే చూస్తారు తప్ప.. అది ఎలాంటి ఆయిల్ తో చేశారు? తింటే ఆరోగ్యానికి మంచిదేనా? అని ఆలోచించరు. చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు తోపుడు బండ్ల మీద అమ్మే స్నాక్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. కొన్ని చోట్ల నీట్ నెస్ మెయింటెయిన్ చేసినప్పటికీ, చాలా చోట్ల అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం ఉందంటే..


నూనె ప్యాకెట్లను కట్ చేయకుడానే..

సాధారణంగా మిర్చీ బజ్జీలు, ఆలు బోండాలు, పకోడీలు తయారు చేయాలంటే, నూనె ప్యాకెట్లు కట్ చేసి, కడాయిలో పోసి, అందులో వేస్తారు. కానీ, ఈ వీడియోలో మాత్రం సదరు వ్యక్తి నేరుగా వేడి ఆయిల్ టో నూనె ప్యాకెట్లను ముంచుతున్నాడు. వేడికి కవర్ కరిగి ఆటో మేటిక్ గా ఆయిల్ కడియిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అతడు అరటి బజ్జీలు, మిర్చి బజ్జీలు వేస్తున్నాడు. టేస్టీగా ఉండటంతో చాలా మంది కస్టమర్లు కూడా తన బండి ముందు నిలబడ్డారు. ఓ యూట్యూబర్, అతడి బిజినెస్ గురించి అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడు. ముంబైలోని కల్ రా మెడికల్ స్టోర్ ఎదురుగా ఉన్న ఈ బండి దగ్గర గత రెండు సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.


నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఈ అపరిశుభ్ర పుడ్ గురించి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నూనె ప్యాకెట్లను కట్ చేయకుండా, వేడి నూనెలో ముంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ నూనెలో కరిగి ఎన్నో రోగాలకు కారణం అయ్యే అవకాశం ఉందంటున్నారు. “ఇక్కడ దొరికే ఫుడ్ తింటే ముందు స్వర్గంలా ఉంటుంది. రెండోసారి తినాలనుకునే లోగా నేరుగా స్వర్గానికే వెళ్లే అవకాశం ఉంది” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “మెడికల్ స్టోర్ కు ఎదురుగా తన బండి పెట్టి మంచి పని చేశాడు. ఇక్కడ తినే తిండితో రోగాలు తెచ్చుకుని, అక్కడ మందులు కొనుగోలు చెయ్యొచ్చు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “మెడికల్ షాప్ సరిపోదు. ఇక్కడ తినే తిడికి నేరుగా క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లాల్సిందే” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఈజీగా క్యాన్సర్ తెచ్చుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే.. ఇక్కడి ఫుడ్ తింటే సరిపోతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆపరిశుభ్ర ఆహారం అమ్ముతున్న అతడిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Related News

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Big Stories

×