E-Paper
Advertisement

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?
Advertisement
IIT hyderabad student missing news

IIT hyderabad student missing news(Telangana news updates): తల్లిదండ్రులు తమ కుమారుడిని ఉన్నత చదువు చదివించాలని సంకల్పించారు. వారి ఆశయాలకు తగ్గట్టే ఆ కుమారుడు చదువులో ముందున్నాడు. ఐఐటీ హైదరాబాద్‌ లో సీటు సాధించాడు. మెకానికల్ విభాగంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో 8 రోజుల క్రితం ఈ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌ ఈ నెల 17న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆ విద్యార్థి విశాఖలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో పోలీసులు, తల్లిదండ్రులు గాలించారు. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ మూర్తి, ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖకు పంపించారు.

Advertisement

చివరకు విద్యార్థి కార్తీక్‌ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. అతడు విశాఖ తీరంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఆ విద్యార్థి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×