E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ ను విడగొట్టేందుకు ప్లాన్.. తిరుపతి శోభనం క్యాన్సిల్.. వల్లికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ ను విడగొట్టేందుకు ప్లాన్.. తిరుపతి శోభనం క్యాన్సిల్.. వల్లికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 16th: ప్రేమ ధీరజ్ లను కలిపేందుకు నర్మద వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఫలించేలా కనిపించవు. ప్రేమ ధీరుజ్లు ఇద్దరు ఒకరు మొహాలకు చూసుకుంటూ ఉంటారు తప్ప అసలు మాట్లాడుకోరు.. అయితే ప్రేమ ధీరజ్లని కలపడానికి ఎంత ప్రయత్నించినా సరే వాళ్లు మాత్రం కలవడానికి అస్సలు ఇష్టపడరు కోసం ప్రేమ ఒక మెట్టు దిగిన కూడా తను మాత్రం ఇంకాస్త బెట్టు చేస్తాడు. వీరిద్దరి గొడవ ఇప్పట్లో సద్దుమణి ఎలా లేదు మనం వెళ్ళిపోదాం పదములేని నర్మదా సాగర్ ని కూడా వెళ్లిపోతారు ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్స్ ఇంకా మిగులుతుంది..

ధీరజ్, ప్రేమలను విడగొట్టేందుకు భద్ర ప్లాన్..

ధీరజ్ ప్రేమలని ఎట్టి పరిస్థితులు కూడా దగ్గర ఎలా చేయకూడదు వాళ్ళిద్దరూ ఎలాగైనా సరే విడగొట్టాలని భద్ర ప్లాన్ చేస్తుంది. వాళ్ళిద్దర్నీ ఎలాగైనా సరే విడగొట్టాలి తమ్ముడు ఎప్పటికీ వాళ్ళిద్దరిని కలవని ఇవ్వకుండా చేయాలి అని భద్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది.. మనం అనుకున్నంగాని అసలు విషయం వేరే ఉందక్క.. వాళ్ళిద్దరూ మల్లి కలిసి పోతారు అని నాకు అనుమానంగా ఉంది. మరి వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టడం అని అడుగుతాడు. వాళ్ళిద్దరికీ ఈగోలు ఎక్కువ కదా ఎలాగైనా సరే వాళ్ళిద్దర్నీ విడగొట్టాలి అని భద్ర ప్లాన్ చేస్తుంది. నువ్వు అంటున్నావు కానీ నాకైతే నమ్మకం కలగట్లేదు అక్క.. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళిద్దరూ కలిసిపోతారని నాకు అనిపిస్తుంది అని అంటాడు.. మనం వాళ్ళిద్దరూ ఇగో నీ దెబ్బకొట్టేలా వాళ్ళ మధ్యలో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి అప్పుడు వాళ్ళిద్దరూ కలవకుండా ఉంటారు అని భద్ర అంటుంది.

తిరుపతి శోభనం క్యాన్సిల్..

Advertisement

తిరుపతి తనకు పెళ్లి అయిపోయింది ఇన్నాళ్లకు తన కోరిక తీరింది అని చాలా సంతోషంగా ఉంటాడు. అయితే సుకన్య లోపలికి వచ్చి మనిద్దరం శోభనం ఇప్పుడే కాదు అని అన్నారు. మన పెళ్లి గురించి అందరూ ఒప్పుకుంటేనే మన శోభనం అని అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళు అటు రామరాజు గారి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటేనే మన శోభనం అని చెప్తున్నారు మరి నువ్వు బాగా నొప్పించే ప్రయత్నం చెయ్యు లేదంటే మాత్రం మన శోభనం జరగదు అని సుకన్య చెప్పగానే తిరుపతి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్ని రోజులు పెళ్లి కాలేదని బాధపడ్డాను కానీ ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా నాకు ఇలాంటి ఎడబాటు ఏంటి అని తిరుపతి చాలా బాధపడిపోతూ ఉంటాడు.. ఏది ఏమైనా కూడా భాగ్యం వాళ్ళ ప్లాన్ మాత్రం సక్సెస్ అవుతుంది..

శ్రీవల్లి ప్లాన్ ఇదే..

శ్రీవల్లి ఇంట్లో వాళ్ళు ఎవరు లేరని తెలుసుకుని బయటకు వచ్చి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. అసలు నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా అమ్మడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని భాగ్యం అడుగుతుంది. తుఫాను తర్వాత ప్రశాంతత లాగా ఉందమ్మా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ మొత్తానికి మనం అనుకున్నట్లుగానే సుకన్యకి పెళ్లి చేసేసాము.. సుకన్య ఆ ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టేలా చేయాలి అని భాగ్యం అలాగే శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది.. ఎలాగైనా సరే సుకన్యని ఆ ఇంట్లోకి అడుగుపెట్టి న తర్వాత మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్అవుతుంది ఎలాగైనా సరే సుకన్యని ఆ ఇంట్లోకి పంపించాలి నేను అదే ప్రయత్నాలు చేస్తాను. ఎలాగైనా సరే ఆ భద్ర మనసుని గెలుచుకొని సుకన్యని ఆ ఇంట్లోకి అడుగుపెట్టేలా చేస్తాను ఆ తర్వాత ఆస్తితో తను చాలా సంతోషంగా ఉంటుంది అని వల్లి అలాగే భాగ్యం ఇద్దరు కూడా పక్క ప్లాన్ చేస్తూ ఉంటారు..

వేదవతి దెబ్బకు వల్లి అవుట్..

Advertisement

వేదవతి శ్రీవల్లి తప్పు చేసింది అని తెలుసుకొని ఎలాగైనా సరే దానికి తనకు తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటుంది.. అయితే లోపలికి వెళ్ళగానే వెదవతిని చూసి ఒక్కసారి కలిసిపోతుంది శ్రీవల్లి. నువ్వు లైట్ ఆఫీస్ రావే మనిద్దరం ఇక్కడ పడుకున్నాము అని వేదవతి అంటుంది.. ఆ మాట వినగానే శ్రీవల్లి అత్తయ్య గారికి నేనంటే ఎంతో ప్రేమ అని అనుకొని లైట్ ఆఫ్ చేయడానికి వెళుతుంది అయితే ఎవరో తెలియదు కానీ వెనకాల నుంచి తనని వీర కుమ్ముడు కుమ్మేస్తారు.. మళ్లీ లైట్ ఆన్ చేస్తే ఎవరు కనిపించరు వేదవతి మాత్రం అదే ప్లేస్ లో కూర్చుని ఉంటుంది.. అయితే వేదవతి దెబ్బకి శ్రీవల్లి ఒంట్లో ఎముకలు విరిగిపోతాయి. మొత్తానికి వేదవతిని తను కొట్టింది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది శ్రీవల్లి. నువ్వు ఈ తప్పులు చేసావని తెలిస్తే ఖచ్చితంగా నీకు ఈ ఇంట్లో స్థానం కాదు ఈ భూమి మీద స్థానం లేకుండా చేస్తాను అని వేదవతి వార్నింగ్ ఇస్తుంది.

నర్మదా దెబ్బకు శ్రీవల్లి షాక్..

నర్మదా తన ఫ్రెండుకు చెప్పినట్లుగానే శ్రీవల్లి గురించి అన్ని విషయాలను తన ఫ్రెండ్ కనుక్కొని ఆధారాలతో సహా దాచిపెడుతుంది. ఆ ఆధారాలను నువ్వు తీసుకొని వెళ్ళు అని నర్మదకు ఫోన్ చేసి చెప్తుంది. సాగర్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో నువ్వు ఇంత తొందరగా ఆఫీస్ కి వెళ్తున్నవ్ ఏంటి అని అనుమానంగా అడుగుతాడు కానీ నర్మద మాత్రం నాకు కొంచెం పని ఉంది అని చెప్పి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే శ్రీవల్లి మాత్రం నర్మద ఏదో చెప్పాలనుకుంటుంది అని చెప్పేస్తుంది. ఆ తర్వాత నేను వచ్చేంతవరకు ఈ తాడు ఇక్కడే ఉంది అక్క దానితో నాకు చాలా పని ఉంది అని నర్మదా శ్రీవల్లి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అటు ధీరజ్ ప్రేమ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అవని ప్లాన్ సక్సెస్.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో మాలినిని చూసి షాకైన జ్యోత్స్న      

Podarillu Today Episode : శేఖర్ ను రెచ్చగొట్టిన చక్రీ.. పెద్దోడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అవని ప్లాన్ సక్సెస్.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

Ninnu kori Serial Today Episode September 16th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్‌ ను సామ్రాట్‌ అనుకుని తీసుకెళ్లిన వాళ్ల అమ్మ – అయోమయంలో చంద్ర  

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

బిగ్ బాస్ అంటే మరీ అంత చులకనేంటీ శ్రీముఖి… యాంకరమ్మ పై భారీ ట్రోల్స్!

ఇండస్ట్రీలో గ్రూపులు.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

Big Stories

Advertisement
×