Intinti Ramayanam Today Episode September 16th : కమల్ ఫోన్ తీసుకున్న పల్లవి శ్రీరాములు వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకొని ఆమెకు ఫోన్ చేసి ఎలా అయినా సరే ఇంటికి రప్పించాలి అని అనుకుంటుంది.. పార్వతి శ్రీరాములు అమ్మ చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ్ ఎలాగైనా సరే ఆ అస్థికలను గోదాట్లో కలపాలి అని అందరికీ చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ఆవిడని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరు ఈవిడ మన ఇంటికి ఎందుకు వచ్చింది అని భానుమతి అడుగుతుంది. చనిపోయింది అనుకున్నా ఆవిడ ఈవిడే శ్రీరాములు వాళ్ళ అమ్మగారు అని పార్వతి అనగానే ఏం జరుగుతుంది అని భానుమతి అడుగుతుంది. పల్లవి ఏమీ చేయకుండానే అంత జరిగిపోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. అసలు పల్లవి ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు.. ఎలాగైనా సరే ఈ నిజాన్ని ఇంకాస్త పెంచేసి పార్వతి చావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
పార్వతి ఏం జరుగుతుంది రా బతికున్న ఆవిడని ఎందుకురా చంపేశారు అసలు ఎవరు చనిపోయారు అని ఆవేశంగా అడుగుతుంది. పల్లవి మన చేతికి మట్టి అంటకుండా అంతా అలా జరిగిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. భానుమతి కూడా బతికున్న వాళ్ళకి పిండం పెట్టడం ఏంట్రా అసలు మీరు పిండం పెట్టింది ఎవరికి ఇంట్లో ఎవరికైనా అయిందా నిజం చెప్పండి రా అని గట్టిగా కేకలు వేసి అరుస్తుంది. ఎవరికి ఏం జరిగింది నిజం చెప్పండి అని పార్వతి కూడా అరవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవని అత్తయ్యకి నిజం తెలిస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ పార్వతి గట్టిగా అడగడంతో అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటుంది.
శ్రీరాములమ్మ గారు ఇంట్లోకి సడన్ గా రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అయితే పార్వతి బతికున్న ఆవిడకి ఎందుకురా మీరు చచ్చిపోయింది అని పిండం పెట్టారు ఎవరికి పెట్టారు రా మీరు అంటూ సీరియల్ అవుతుంది. నేను చచ్చిపోవడమేంటి నేను బతికే ఉన్నాను కదా అని ఆవిడ కూడా అనడంతో అందరూ ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. పార్వతి ఎవరికి పడితే వాళ్లకి పెళ్ళాం పెడితే ఇలానే ఉంటుంది చచ్చిపోయి దెయ్యం అయి మన ఇంటికి వచ్చింది అని అందరినీ డేటు ఉండగా నేను చనిపోవడం ఏంటండీ నేను దెయ్యం అవడం ఏంటండీ అంటూ ఆవిడ అంటుంది. ఈవిడ చనిపోదు మరి ఎవరు చనిపోయారు ఎవరికి మీరు పిండం పెట్టారో చెప్పండి అంటూ అడుగుతుంది. పార్వతికి నిజం చెప్పేస్తారు ఏమో అని పల్లవి చాలా సంతోషపడుతుంది కానీ తన ఆనందం ఆవిరి అయిపోయింది..
అత్తయ్య మీరు అనుకుంటున్నట్లు కమల్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ కాదు శ్రీరాజ్.. ఆరోజు ఏదో కంగారులో మీకు అబద్ధం చెప్పినట్లు ఉన్నాడు. చనిపోయింది శ్రీరామ్ వాళ్ళ అమ్మ కాదు శ్రీ రాజ్ వాళ్ళమ్మ అతను కూడా కమలికి మంచి ఫ్రెండే అని చెప్పడంతో శ్రీరాం వాళ్ళ అమ్మ శ్రీ రాజ్ ఎవరు నాకు ఎప్పుడూ తెలియదే అని అడుగుతుంది. తను కూడా అమెరికాలో ఉంటాడండి నీకు శ్రీరామ్ చెప్పలేదా అని అవని అంటుంది. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి అవన్నీ పార్వతిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.. ఇక మొత్తానికి పార్వతి అవని చెప్పిన మాట నిజమే అనుకొని నమ్ముతుంది.. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవని చాలా తెలివిగా ఇలా నా ప్లాన్ ని తిప్పి కొడుతుంది అని అసలు అనుకోలేదు అని మనసులో అనుకోని చాలా బాధపడిపోతూ ఉంటుంది.
శ్రియ వంటగదిలో ఉన్న మీనాక్షి దగ్గరికి వెళ్లి బాబుకి ఉగ్గు చేస్తాను అన్నారు కదా ఏమేం కావాలి ఎలా చేయాలి చెప్పండి పిన్ని గారు అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవనీని కందిపప్పు ఇవ్వమని అడిగితే.. తను అక్కడ ఉన్న పప్పులన్నీ ఇస్తుంది తప్ప కందిపప్పు ఇవ్వదు. ఏమైంది ఎందుకు అంత ధ్యానంగా ఉన్నావు అని అడుగుతారు. ఏమీ లేదమ్మా సడన్గా ఆ శ్రీరాం వాళ్ళమ్మ ఇంటికి వచ్చి అత్తయ్యకు బాగాలేదని అడిగింది కదా ఎవరో ఫోన్ చేస్తే రమ్మని పిలిచినట్లుగా ఆవిడ వచ్చింది అంటే ఎవరైనా నిజంగానే పిలిచారా లేదా ఆమె అత్తయ్య గారు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని వచ్చిందా అన్నది క్లారిటీ రాలేదు.. కచ్చితంగా పల్లవిని ఇదంతా చేసి ఉంటుందని అవనికి అనుమానం ఇచ్చి పల్లవి దగ్గరికి వెళుతుంది.. అక్కడ పళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండదా? అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..