Janasena: అదిగో పులి అంటే.. ఇదిగో మేక అన్నచందంగా ఉంది ఏపీలో రాజకీయాలు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలు.. మళ్లీ సొంత పార్టీ వైపు చూస్తున్నట్లు గడిచిన వారం రోజులుగా ప్రచారం సాగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ వెళ్తున్నారని, ఈ క్రమంలో బెంగుళూరులో ఆయన జగన్‌తో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జనసేన నేత క్లారిటీ ఇచ్చారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రంగా జనసేనలో రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీ అధికారం పోయిన తర్వాత ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్లుగా ఆయన మీడియా ముందు పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మళ్లీ వైసీపీలోకి వెళ్లబోతున్నట్లుగా గడిచిన నాలుగైదు రోజులుగా ప్రచారం సాగుతోంది. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో వివాదంతో జనసేనకు బాలినేనిని దూరంగా ఉంటున్నారని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కమిటీలో ఆయనకు స్థానం లేదని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బెంగుళూరులో జగన్‌ను బాలినేని భేటీ అయ్యారని, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జాయిన్ కావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జనసేన పార్టీ గురించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ నేత, ఏపీ టిడ్కో ఛైర్మన్ అజయకుమార్. బాలినేని శ్రీనివాస్ పై చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొంతమంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంతో ఈ విధంగా వార్తలు రాస్తున్నారని చెప్పారు.
జనసేనలో చేరిన రోజు నుంచి ఆయన మీద ఈ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఎక్స్ వేదికగా కొన్ని విషయాలు రాసుకొచ్చారు. కొద్దిరోజులుగా బాలినేని.. బెంగుళూరులో జగన్‌ను కలిసి తిరిగి వైసీపీలోకి వెళ్తునట్టు ఓ అబద్దాన్ని సృష్టించారని ఆరోపించారు. ఆ రాజకీయ పార్టీకి కొమ్ము కాసే చానళ్లు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ని బాలినేని కలవలేదని, జనసేన పార్టీని వదలాలనే ఆలోచన లేదన్నారు. ఈ మాటలు తాను చాలా భాద్యతతో మాట్లాడుతున్నానని, బాలినేని రాజకీయంగా పెద్ద స్ధాయి ఉన్న నాయకులని రాసుకొచ్చారు.
ALSO READ: ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!
బాలినేని అంటే పవన్ కళ్యాణ్‌కు చాలా గౌరవం, ఇష్టమని ప్రస్తావించారు. జనసేన కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం కోసం బాలినేని తన వంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విపక్షాలు, స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయనపై ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరేమనుకున్నా ఎన్ని కుతంత్రాలు చేసినా బాలినేని జనసేన పార్టీలో కీలక నాయకుడని తెలియజేశారు. మా పార్టీకి, రాష్రానికి సేవలు అందించడం ఖాయమని తేల్చేశారు.
కొంత మంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంతోనో, లేదా ఏ లాభం కోరి ఇటువంటి వార్తలు వ్రాస్తున్నారో తెలియదుకానీ, బాలినేని శ్రీనివాస్ గారి మీద వారు చేసే ఈ అబద్ధపు, విష ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని గారు మా జనసేన పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు… pic.twitter.com/nN5BhOKLHz
— Ajaya Kumar Janasena (@AjayaKumarJSP) September 15, 2026