Kamran Akmal On Nitish Reddy Ready: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇందులో వరుసగా రెండింటిలో గెలిచిన టీమిండియా, 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. రేపు చివరి టి20 జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు (Kamran Akmal On Nitish Reddy Ready) చేశారు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా కేవలం నితీష్ కుమార్ రెడ్డికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. అయితే దీనికి కాస్త సమయం పడుతుందని వివరించే ప్రయత్నం చేశారు కమ్రాన్ అక్మల్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( IND VS AFG) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. ఆల్రౌండర్ పాత్రలో ఈ టోర్నమెంట్ లో ఛాన్స్ కొట్టేసిన నితీష్ కుమార్ రెడ్డి… వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొదటి మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి… నిన్న జరిగిన మ్యాచ్ లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఆఫ్గనిస్తాన్ నడ్డి విరిచాడు. మొత్తంగా ఈ సిరీస్ లో ఇప్పటికే ఐదు వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఇప్పటివరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు కానీ.. ఆ ఛాన్స్ కూడా వస్తే మనోడు ఇరగదీసేవాడని అంటున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన నితీష్ కుమార్ రెడ్డి పై ( Nitish kumar reddy) కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal) ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా ( Team India) జట్టులో నితీష్ కుమార్ రెడ్డి రూపంలో మరో అద్భుతమైన ఆల్రౌండర్ దొరికాడని వెల్లడించారు. హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టి నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే బెటర్ అని సూచనలు చేశారు. జాక్ కాలిస్ లాగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని గుర్తు చేశారు. హార్థిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో… అతడిని పక్కకు పెట్టి నితీష్ కుమార్ రెడ్డికి చాన్సులు ఇస్తే బెటర్ అని బిసిసిఐకి సూచనలు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు.