E-Paper
Advertisement

Sabitha Indra Reddy : సబితా ఇంద్రారెడ్డి సన్నిహితుడి ఇంట్లో భారీగా డబ్బు..! ఎన్నికల కోసమేనా..?

Sabitha Indra Reddy : సబితా ఇంద్రారెడ్డి సన్నిహితుడి ఇంట్లో భారీగా డబ్బు..! ఎన్నికల కోసమేనా..?
Advertisement

Sabitha Indra Reddy : మహేశ్వరం.. మామూలు రోజుల్లో పెద్దగా ప్రచారంలో కనిపించని నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఇప్పుడు మార్మోగుతోంది. తొలి కారణం.. వరుస విజయాల మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండడం. అప్పటి నుంచి మహేశ్వరంలో వేడి మొదలైంది. తర్వాత ఐటీ సోదాలు ఆ హీట్‌ను పీక్స్‌కు చేర్చాయి. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసాలు, ఫామ్ హౌసుల్లో సోదాలు జరిగాయి. వాళ్లకు దొరికిందేమీ లేదనే చెప్పాలి. కట్ చేస్తే.. డాక్టర్ రెడ్డీస్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ నరేందర్ నివాసాల్లో ఐటీ అధికారులు రెయిడ్స్ చేశారు. వాటికి, ఎన్నికలకు లింక్ లేదని తొలుత అంతా అనుకున్నారు. కానీ.. సబితా ఇంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రదీప్ నివాసాల్లో జరిగిన సోదాల్లో కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఇదంతా మహేశ్వరం అసెంబ్లీ ఎన్నికల్లో పంపకాల కోసం సమకూర్చుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహేశ్వరం నియోజకవర్గాన్ని అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఆమెను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉందంటూ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఒకప్పుడు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరొక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ ఫేస్ టు ఫేస్ తలపడుతున్నారు. దీంతో మహేశ్వరం పేరు మార్మోగుతోంది.

Advertisement

.

.

Advertisement

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×