E-Paper
Advertisement

IT Raids on Telangana Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుల ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids on Telangana Congress : బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ దాడులను ముమ్మరం చేసింది. వరుస దాడులతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. గెలుపోటములను ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

IT Raids on Telangana Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుల ఇంట్లో ఐటీ సోదాలు
Advertisement

IT Raids on Telangana Congress : బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ దాడులను ముమ్మరం చేసింది. వరుస దాడులతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. గెలుపోటములను ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఐదున్నర నుంచి మంచిర్యాలలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోని ఆయన ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి.

Advertisement

ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారు ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామిపై చేస్తున్న ఐటీ దాడులకు నిరసనగా చెన్నూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు.

హైదరాబాద్‌లో ఇటీవల ఐటీ దాడులు కలకలం రేపాయి. కాంగ్రెస్‌ నేతలే టార్గెట్‌ దాడులు జరిగాయి. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్‌పేట కాంగ్రెస్‌ మేయర్‌ చిగురింత పారిజాత నరసింహరెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు.. విచారణకు రావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం కేఎల్‌ఆర్‌, పారిజాత నివాసం, ఆఫీసుల్లో రెండ్రోజులపాటు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Advertisement

ఇక.. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య, సోదరుడిపై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వారి ఇద్దరినీ హైదరాబాద్‌ తరలించారు. ఆస్తులపై ఇంకా వివరాలు కావాల్సి ఉన్నందున.. విచారించడానికి తీసుకెళ్తున్నామన్న అధికారులు చెప్పారు. ఐటీ దౌర్జన్యానికి దిగారంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారితో సంతకాలు చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు.

మాజీమంత్రి, ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఖమ్మంలోని శ్రీ సిటీలోని తుమ్మల ఇంట్లో తనిఖీలు చేశారు. పలు పత్రాలను అధికారులు పరిశీలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తనపై ఐటీ దాడులు జరిగే అవకాశముందని ప్రకటించిన కొద్దిసేపటికే తుమ్మల ఇంట్లో ఈసీ సోదాలు చేయడం కలకలంగా మారింది.

కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. జానా తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబందించిన లెక్క పత్రాల వివరాలను సేకరించారు. దీంతోరాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలకు సంబందించిన 18 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×