Pailla Rajasekhar Reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రలోభాల పర్వం అప్పుడే మొదలైంది. అధికార పార్టీ ఇతర పార్టీల నాయకులను లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. భువనగిరిలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
Pailla shekar Reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రలోభాల పర్వం అప్పుడే మొదలైంది. అధికార పార్టీ ఇతర పార్టీల నాయకులను లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. భువనగిరిలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
భువనగిరిలో బీఆర్‌ఎస్ కుట్రను కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి కాంగ్రెస్ నేత పొలిశెట్టి అనిల్ షాక్ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ అనిల్‌కు డబ్బులతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎర వేశారని సమాచారం. కాంగ్రెస్ వదిలి బీఆర్‌ఎస్‌లో చేరితే 30 లక్షలు ఇస్తానంటూ పైళ్ల శేఖర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని పోలిశెట్టి అనిల్ ఆరోపణలు చేశారు.
అడ్వాన్స్‌గా తనకు రూ. 5లక్షల పంపిచారని అనిల్ చెప్పారు. మీడియా సమావేశం పెట్టి నోట్ల కట్టలను చూపించారు పొలిశెట్టి అనిల్. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత మిగతా రూ.25 లక్షలు ఇస్తానంటూ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆఫర్ చేశారని అనిల్ తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు పోలిశెట్టి అనిల్ ఫిర్యాదు చేశారు
వారం రోజులుగా తనకు పైళ్ల శేఖర్‌రెడ్డి ఫోన్ చేస్తున్నారని అనిల్ తెలిపారు. పార్టీ మారడానికి తన మనస్సాక్షి అంగీకరించలేదన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామంటూ అనిల్ వర్గం ప్రకటించింది. ఓడిపోతానన్న భయంతోనే డబ్బులు శేఖర్ రెడ్డి వెదజల్లుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
.
.