Dowry Harassment: పెళ్లయిన పద్దెనిమిది రోజులకే యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదమిది. అదనపు కట్నం కోసం భర్త పెట్టిన వేధింపులు భరించలేకనే ప్రాణాలు తీసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కలకలం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కూతురు పల్లవి (20). ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గతనెల 30న చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో కూతురి వివాహం జరిపించాడు. ఇదిలా ఉండగా పల్లవి తాను చదువుతున్న కాలేజీ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది.
Also read: తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!
తీవ్రంగా గాయపడ్డ ఆమెను మొదట జీడిమెట్లలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు, అక్కడి వైద్యుల సలహా మేరకు మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లవి తుదిశ్వాస వదిలింది. పెళ్లయిన కొన్ని రోజుల నుంచే అదనపు కట్నం కోసం శ్రీకాంత్ రెడ్డి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయటంతో భరించలేక పల్లవి ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also read: హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!