E-Paper
Advertisement

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?
Advertisement

 Singareni: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ నేలకు వెలుగులు పంచేందుకు భూమి పొరల్లోకి దిగి, తమ చెమటను నల్ల బంగారంగా మారుస్తున్న సింగరేణి కార్మికుల సేవలు వెలకట్టలేనివని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.సింగరేణి కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్ల స్థలాలపై హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నాయని, వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

చట్టబద్ధమైన పరిష్కారం..

సింగరేణి బొగ్గు బెల్ట్ ప్రాంతంలోని ఇళ్ల స్థలాల సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం చూపుతూ, అర్హులైన కుటుంబాలకు హక్కు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికుల ఇండ్ల స్థలాల సమస్యపై శనివారం నాడు సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో జారీ చేసిన జీవో 76, పరిగణనలోకి తీసుకొని, భూముల స్వభావం, ప్రభుత్వ,సింగరేణి హక్కులు, ప్రస్తుత నివాస పరిస్థితులు, చట్టపరమైన అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Advertisement

Also read: బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

45 రోజుల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం..

సింగరేణి బొగ్గు బెల్ట్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గౌరవ హైకోర్టు ఆదేశాలకు లోబడి 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు.

నిబంధనల ప్రకారం..

Advertisement

దరఖాస్తుల పరిశీలనలో ఏవైనా అవకతవకలు , నిబంధనలకు సంబంధించిన అంశాలు గుర్తిస్తే, అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం వాటిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కుటుంబాలకు చట్టబద్ధమైన హక్కు కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Also read: పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

Tags

Related News

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి!

జన్వాడ ఫామ్‌హౌస్‌పై రాజకీయ దుమారం.. కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్!

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌

Big Stories

Advertisement
×