E-Paper
Advertisement

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?
Advertisement

Jurala Water: స్వేచ్ఛ బ్యూరో: జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వాల, ఆత్మకూరులో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఎంపీ డీకే అరుణ శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితులను వివరించారు.

నిరసనలతో ఆందోళన..

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు నీరు అందక ఎండిపోతుండటంతో గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గుర్తు చేశారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే మూడు రోజులలోగా జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత భవిష్యత్తులో అధికారులు నీటిని విడుదల చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Also read: హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!

అన్నదాతలు కన్నీరు..

రైతులు చెమటోడ్చి పండించిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని, ప్రభుత్వం స్పందించి జూరాల దిగువన సాగుభూములకు వెంటనే నీటిని విడుదల చేయాలని అన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి పై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Also read: చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

Tags

Related News

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×