E-Paper
Advertisement

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
Advertisement

Tirumala Brahmotsavams: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకునేందుకు తిరుపతికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ముందుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోగా, ఆ తర్వాత సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకొని పద్మావతి అతిథి గృహంలో విడిది చేశారు. బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభతో తిరుమల పులకించిపోతోంది.

స్వామివారికి పట్టువస్త్రాలు..

Advertisement

ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా బేడీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మంగళవాద్యాల నడుమ స్వామివారికి పట్టువస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు అందించడం ఇది 15వ సారి అని, ఈ అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..

Advertisement

అనంతరం శ్రీవారిని దర్శించుకున్న సీఎం దంపతులకు రంగనాయకుల మంటపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2027 నూతన క్యాలెండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరించారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగాలని, అందులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికరమైన దర్శనం కల్పించాలని అధికారులకు సూచించి, టీటీడీ కట్టుదిట్టమైన నిర్వహణను అభినందించారు.

పెద్దశేష వాహనంపై ఊరేగింపు..

దర్శనానంతరం బ్రహ్మోత్సవాల మొదటి రోజు వేడుకల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నాలుగు మాడ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగుతుండగా భక్తులు నీరాజనాలు అర్పించారు. కాగా, ఈ పర్యటన ముగించుకుని రాత్రికి తిరుమలలోని గాయత్రి నిలయంలో నారా కుటుంబం బస చేయనుంది.

Tags

Related News

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్

డీఎస్సీ, APPSC అక్రమాలపై CBI విచారణ జరపాల్సిందే.. మాజీ మంత్రి అంబటి డిమాండ్!

ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!

Big Stories

Advertisement
×