E-Paper
Advertisement

Kaikala: అనంత లోకాలకు కైకాల.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

Kaikala: అనంత లోకాలకు కైకాల.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
Advertisement

Kaikala: వెండితెర యముడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతిక రూపం కనుమరుగైంది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గన్ సెల్యూట్ సమర్పించారు. కైకాల కుమారుడు.. తండ్రి చితికి నిప్పంటించారు. అలా, 87 ఏళ్ల ఆ సినీ సార్వభౌముడు అగ్నిలో కలిసిపోయారు.

700కు పైగా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కైకాల సత్యనారాయణ.. అనారోగ్య సమస్యలపై శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ కైకాల నటనను కొనియాడారు. సీఎం కేసీఆర్ కైకాల కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్థీవ దేహానికి అనేక మంది నివాళులు అర్పించారు.

Advertisement

శనివారం కైకాల ఇంటి నుంచి మహాప్రస్థానం వరకు.. అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రకూ చాలామంది అభిమానులు, ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను నిర్వహించింది.

అలా, టాలీవుడ్ నవరస నటనా సౌర్వభౌముడు ఇక భౌతికంగా దూరమయ్యారు. తన సినిమాలతో శాశ్వతంగా మనతోనే ఉండనున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×