BigTV English

PM Modi: లక్కీ డ్రాలో మిక్సీ గెలుచుకున్న ప్రధాని మోదీ.. ట్విస్ట్ ఏమిటంటే..

PM Modi: లక్కీ డ్రాలో మిక్సీ గెలుచుకున్న ప్రధాని మోదీ.. ట్విస్ట్ ఏమిటంటే..

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ లక్కీ డ్రాలో మిక్సీ గెలుచుకున్నారు. ఔను మీరు విన్నది నిజమే. దసరా సంధర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా సంధర్భంగా ఈ విచిత్రం జరిగింది. అదేంటీ.. ప్రధాని ఏంటి ? మిక్సీ ఏంటి ? గెలుచుకోవడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.


దసరా అంటేనే అదొక సంబరం. నగరాలు, పట్టణాలలో కన్నా గ్రామాలలోనే సందడి అధికంగా ఉంటుంది. ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారు.. తప్పక ఈ పండుగకు తమ గ్రామాలకు చేరుకుంటారు. అందుకే గ్రామాలలో దసరా సందడి ఏమో కానీ.. ప్రతి ఇంటా సందడి వాతావరణం కనిపిస్తుంది. ఉదయాన్నే పూజలు, ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ సారి చాలా గ్రామాలలో లక్కీ డ్రా కాంటెస్ట్ ల హవా సాగింది. ఈ లక్కీ డ్రాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు.

లక్కీ డ్రాలో ఎవరైనా తమ ఇష్టమైన వారి పేర్లు కానీ, లేక దేవుళ్ల పేర్లు గానీ రాస్తారు. అలా చేస్తే లక్కీడ్రా చేజిక్కించుకుంటామన్న అభిప్రాయం వారిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. చివరికి గిఫ్ట్ పట్టేశాడు.


కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందరూ చిన్నా, పెద్దా తేడా లేకుండా పాల్గొని నవరాత్రుల సంధర్భంగా బతుకమ్మ తల్లిని ఏర్పాటు చేసి, అమ్మవారి చెంత భక్తిగీతాలను అలపిస్తూ సందడి చేశారు. అయితే ఇక్కడ దసరాను పురస్కరించుకొని లక్కీ డ్రా కాంటెస్ట్ కూడా నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో అందరూ పాల్గొన్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం లక్కీ డ్రా లో పాల్గొనేందుకు వచ్చి, తన పేరు రాయలేదు.. తన కుటుంబ సభ్యుల పేర్లు రాయలేదు.. ఇంతకు ఎవరి పేరు రాశాడో తెలుసా.. తన అభిమాన నేత , మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరు వ్రాసి లక్కీ డ్రాలో పాల్గొన్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు ఆ వ్యక్తి.

Also Read: Konda Surekha vs KTR: కేటీఆర్ పరువు నష్టం దావా కేసు.. విచారణ.. తాజా అప్ డేట్ ఇదే

ఇంకేముంది.. లక్కీడ్రా తీసే సమయం రానే వచ్చింది. నేరుగా ప్రధాని పేరు రాస్తే నాకు బహుమతి రాదా అనుకుంటున్నాడు మదిలో. ఈ కాంటెస్ట్ లో మొదటి బహుమతిగా కూలర్, రెండవ బహుమతిగా మిక్సర్, మూడవ బహుమతిగా గ్యాస్ స్టవ్ ప్రకటించారు. మొదటి కూపన్ బయటకు తీశారు. వేరే పేరు వచ్చింది. ఇక మనోడి ఆశలు ఇక గల్లంతే అనుకున్నాడు. అప్పుడే రెండవ కూపన్ బయటకు తీసిన నిర్వాహకుడు వెంటనే నరేంద్ర మోదీజీ అంటూ కేకలు వేశాడు.

ఇక అంతే అక్కడ ఉన్నవారందరూ షాక్. ఈయన ఎవరు స్వామీ ఏకంగా ప్రధాని పేరు మీద లక్కీడ్రా లో పాల్గొన్నాడు అంటూ అతని వైపే చూశారు. ఇక మనోడికి మిక్సీ వచ్చేసింది. చకచకా చేతిలో పట్టుకున్నాడు ఇంటికెళ్లాడు. మనతో మజాకా.. మా నేత పేరు రాస్తే.. లక్ లక్కీగా తగలాల్సిందే అంటూ స్థానికులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆ వ్యక్తి. మొత్తం మీద ఇదన్న మాట.. ప్రధానికి లక్కీడ్రా లో మిక్సీ లభించడం వెనుక ఉన్న రహస్యం. మీరు కూడా ఈసారి ట్రై చేస్తారేమో ట్రై చేయండి మరి.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×