BigTV English

Konda Surekha vs KTR: కేటీఆర్ పరువు నష్టం దావా కేసు.. విచారణ.. తాజా అప్ డేట్ ఇదే

Konda Surekha vs KTR: కేటీఆర్ పరువు నష్టం దావా కేసు.. విచారణ.. తాజా అప్ డేట్ ఇదే

Konda Surekha vs KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తనపై వస్తున్న ట్రోలింగ్స్ కి కేటీఆర్ కు సంబంధం ఉందంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అలాగే హీరోయిన్ సమంతా పేరును సైతం తెరపైకి తీసుకురాగా.. సమంతా కూడా ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం తగదని, ఇటువంటి వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతింటాయని సమంతా అన్నారు. సమంతా ప్రకటనతో వెంటనే తేరుకున్న మంత్రి సురేఖ సారీ సమంత అన్నారు.


ఇక రాజకీయ విమర్శల వరకు ఒకేగానీ.. అసలు సంబంధం లేని తమ పేర్లు పలకడంపై.. అక్కినేని ఫ్యామిలీ గుర్రుమంది. దీనితో సినిమా ఇండ్రస్ట్రీ మొత్తం ఒక్కసారిగా నాగార్జునకు మద్దతుగా మంత్రి సురేఖ పై విమర్శల వర్షం కురిపించింది. అంతేకాదు పలు మహిళా సంఘాలు సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ఇక ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ సారీ చెప్పారు. అయితే నాగార్జున మాత్రం తన పరువుకు భంగం కలిగిందంటూ.. న్యాయస్థానంను ఆశ్రయించారు. ఆ కేసులో ఇప్పటికే నాగార్జున, సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసుకొని మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వతేదీకి విచారణను వాయిదా వేసింది.

Also Read: KCR: జనంలోకి రాబోతున్న కేసీఆర్… ఏం చేయబోతున్నారో తెలుసా…? ఎవరికీ తెలియని నిజాలివే..!


కాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర రావు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ , సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా ఇందులో పేర్కొన్నారు. నేడు న్యాయస్థానంలో విచారణ జరగగా.. తదుపరి విచారణ 18వ తేదీకి వాయిదా పడింది. అలాగే 18 వతేదీన కేటీఆర్, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×