Rajagopal Reddy: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ysr వర్ధంతి వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు లక్షలాది మంది ఉన్నారని అన్నారు. ysr ఆశయాల కోసం పాటుపడుతా ysr స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చానని కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
నాపై ఎవరెన్ని కుట్రలు చేసినా ysr శిష్యులం మేము ysr ని మేము అస్సలు మరవం అని తేల్చి చెప్పారు. సీఎం సీఎం అంటున్నారు అదే టైం వస్తే బ్రహ్మ దేవుడు కూడా నన్ను ఆపలేడని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తవాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తే రాజగోపాల్ రెడ్డి ఊరుకోడని అన్నారు.
Also Read: ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!
కొంత మంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తా మల్లి ysr రాజ్యం తీసుకొస్తా మని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాఫ్ట్రంలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎనాడు అన్యాయం జరగదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Also Read: ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!