BigTV English
Advertisement

KomatiReddy: నోటికొచ్చినట్టు అనడం.. కవర్ చేసుకోవడం.. కోమటిరెడ్డిని భరించాల్సిందేనా?

KomatiReddy: నోటికొచ్చినట్టు అనడం.. కవర్ చేసుకోవడం.. కోమటిరెడ్డిని భరించాల్సిందేనా?

KomatiReddy: కోమటిరెడ్డి నాలుక.. పాములా మెలికలు తిరుగుతోంది. ఓసారి ఇటు.. మరోసారి అటు.. ఇంకోసారి ఎటో. ఇటీవల ఆయన ఫ్రస్టేషన్ పీక్స్ కి చేరినట్టుంది. పీసీసీ పీఠం తనకు కాకుండా పోయినప్పటి నుంచీ.. ఆగమాగం మాట్లాడుతున్నారు.. పార్టీని ఆగమాగం చేస్తున్నారు.. అనే విమర్శలు ఉన్నాయి.


తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు తప్పదు.. ఏంటిది? ఈ వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ కు ఎంత డ్యామేజ్ చేస్తాయి ఈ కామెంట్లు? ఓవైపు రేవంత్ రెడ్డి.. ఒక్కో అడుగు వేసుకుంటూ.. పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంటే.. కోమటిరెడ్డి మాత్రం ఒక్క మాటతో మొత్తం శ్రమను పేకమేడలా కూల్చేశారు. కాంగ్రెస్ సొంతంగా గెలవదు.. బీఆర్ఎస్ తో పొత్తు అనే సరికి.. బీజేపీకి కొబ్బరిచిప్ప దొరికినట్టైంది. ఇదే ఛాన్స్ గా బండి సంజయ్ రంగంలోకి దిగిపోయారు. చెప్పానా? నే చెప్పానా? ఆ రెండు పార్టీలు తోడుదొంగలని నే చెప్పానా? అంటూ కాంగ్రెస్ పుట్టి మరింత ముంచే ప్రయత్నం చేశారు. వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. వివరణ ఇచ్చుకునే క్రమంలో మళ్లీ మాట మార్చేశారు. అంతూ తూచ్ అనేశారు.

పార్టీ ఇంఛార్జ్ థాక్రే హైదరాబాద్ లో విమానం దిగీదిగగానే.. నేరుగా విమానాశ్రయం వెళ్లిపోయి.. లాంజ్ లోనే వివరణ ఇచ్చుకున్నారు కోమటిరెడ్డి. ఆయన మాటలను వక్రీకరించారట.. సెక్యూలర్ పార్టీలతోనే పొత్తు అని చెప్పారట.. మీడియానే ఆయన మాటల్ని వక్రీకరించిందట.. బీజేపీ ఆ విషయాన్ని రాజకీయం చేస్తోందట.. ఇలా సాగింది వెంకట్ రెడ్డి సంజాయిషీ.


పొద్దున్న కలకలం.. సాయంత్రం కవరింగా? అంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ వాదులు. గతంలో మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఇలానే చేశారని గుర్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉండి.. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి.. తన సోదరుడైన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని అడగడం.. ఆ ఆడియో కాస్త వైరల్ అవడం అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చాక.. లేదు లేదు.. తానలా అనలేదు.. తన వాయిస్ తో ఫేక్ ఆడియో క్రియేట్ చేశారంటూ అప్పట్లో బుకాయించారు. మళ్లీ లేటెస్ట్ గా అలాంటి సీనే రిపీట్ చేశారు.

ఎందుకు? అసలెందుకు కోమటిరెడ్డిని భరించాలి? వరుసబెట్టి పార్టీని డ్యామేజ్ చేసే పనులు చేస్తున్నా.. ఆయనపై వేటు ఎందుకు వేయడం లేదనేది సగటు కాంగ్రెస్ వాది ప్రశ్న. ఎవరో మామూలు లీడర్ అయితే ఈ పాటికి యాక్షన్ వచ్చుండేది. అక్కడుంది కోమటిరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడు. అంగబలం అధికంగా ఉన్న నేత. అసలే వలసలతో కాంగ్రెస్ బలహీనంగా కనిపిస్తోంది. ఉన్న వాళ్లనూ వెళ్లగొడితే మరింత వీక్ అవుతుంది. అందుకే, కోమటిరెడ్డి ఎంతగా కల్లోలం రేపుతున్నా.. చూస్తూ వస్తోంది హైకమాండ్. వెంకట్ రెడ్డి సైతం బీజేపీతో టచ్ లో ఉండే.. ఇలా కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. కానీ, ఎప్పటికీ ఇలానే ఉంటుందని అనుకోలేం.. కోమటిరెడ్డి తీరు మారకపోతే.. ఆయన మీదా యాక్షన్ తీసుకునే రోజు ఒకటి వస్తుందని కాంగ్రెస్ వాదులు చర్చించుకుంటున్నారు.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×