E-Paper
Advertisement

KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్

KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్
Advertisement

KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడొద్దంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు తాము చాలా కష్టపడ్డామన్నారు. రూ. 9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదన్నారు. కార్నింగ్ ప్లాంట్, అమరరాజా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తదని తాను ఆశిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలంటూ ఆయన అన్నారు.

Also Read: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

Advertisement

ఇదిలా ఉంటే.. యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాన్ ఒజ్కికి మృతివార్త చాలా బాధ కలిగించిందన్నారు. అత్యంత డైనమిక్ గా ఉండే ఒజ్కికి ఎంతో తెలివైనవారన్నారు. ఆమెతో పలు సందర్భాల్లో మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఒజ్కికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×