Viral News: ఒక్పపుడు గిన్నిస్ రికార్డు అంటే ఎంతో ఊహించుకునే వారు. ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ రికార్డు సాధించడం అంటే అది ఏదో ఒకటి, రెండు లేదా ముగ్గురికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు తరచూ ఏదో ఒక సాహసం చేస్తూ వేల మంది గిన్నిస్ రికార్డులు సాధిస్తున్నారు. అందులో వయసుతో సంబంధం లేకుండా మరి ప్రయత్నాలు చేస్తున్నారు. పుట్టిన పిల్లల నుంచి మొదలుకుని ముసలి వాళ్ల వరకు గిన్నిస్ రికార్డులు సాధిస్తున్నారు. అయితే గిన్నిస్ రికార్డు సాధించడమే గొప్ప అనుకుంటే అందులో కొంత మంది మాత్రం ఏకంగా ఒకటి కాదు రెండు మూడు రికార్డులు సాధిస్తుంటారు.
తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఒకటి రెండు కాదు ఏకంగా ఊహించని రికార్డులు సాధించాడు. ఒక రికార్డు సాధించడానికే ఎన్నో ఏళ్లుగా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది రికార్డులను బ్రేక్ చేసి మరో రికార్డు చేయాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా ఎంత ప్రయత్నించినా కూడా మహా అయితే ఒకటి లేదా రెండు, మూడు సాధించవచ్చు. కానీ ఒ వ్యక్తి మాత్రం ఏకంగా 15 గిన్నిస్ రికార్డులు సాధించాడు. అది కూడా కేవలం ఒకే రోజులో అంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోవాల్సి విషయమనే చెప్పాలి మరి.
ఈ ఘటన అమెరికాలో వెలుగుచూసింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని 250 రికార్డులను బ్రేక్ చేశాడు. అమెరికాకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి ఒకే రోజులో 15 గిన్నిస్ రికార్డులను సాధించాడు. ఈ మేరకు లండన్ లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయం వద్ద దిగిన ఫోటోలను గిన్నిస్ రికార్డ్ యాజమాన్యం షేర్ చేసింది. తన 180 ఏకకాల మెడల్స్ ను వేలం వేయడానికి డేవిడ్ రష్ ఆఫీసుకు వెళ్లాడు. అయితే ఒకే రోజులో 15 రికార్డులు సాధించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని గిన్నిస్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేత విల్ సిండెన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
A big day out for @DavidWRush at GWR HQ 💪https://t.co/J72DlCbibN
— Guinness World Records (@GWR) August 9, 2024