BigTV English

Sitarama Project Trial Run: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

Sitarama Project Trial Run: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

Sita Rama Lift Irrigation Project: భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ -2ను ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంప్ హౌస్ ట్రయల్ రన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టు 15న రూ. 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తామని తెలిపారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామని ఆయన చెప్పారు.


Also Read: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడొద్దు..రేవంత్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్

రీడిజైన్ పేరుతో గత పాలకులు రూ. 8 వేల కోట్లు వృథా చేశారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడక సాగాయన్నారు. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల పూర్తి చేయాలని వారు చెప్పారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయంటూ మంత్రి వివరించారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×