Illegal Construction: బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుక ధోరణిలో వ్యవహరిస్తుందా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరొకలా ఉంటుందా? మూసీ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వంలో పునాదులు పడ్డాయా? కాంగ్రెస్ సర్కార్ కంటిన్యూ చేస్తోందా? ప్రజలను ఆకట్టుకునేందుకు వారి తరపున పోరాటం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మూసీ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ ప్రజలకు అడ్డంగా దొరికిపోయింది. ఇన్నాళ్లూ ఆ పార్టీ నేతలు పోరాటమంతా డ్రామాగా తేలిపోతోంది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం నాడు మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
2017లో మూవీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పత్రాలకు బయటపెట్టారు మంత్రి. మూసీ నదికి 50 మీటర్లు బఫర్ జోన్ ఏర్పాటు చేసిందని వివరించారు. మూసీ ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్, ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారు.
సాక్షాత్తూ అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కొట్టి పారేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ALSO READ: బీఆర్ఎస్ కథ అడ్డం తిరిగింది.. నిర్ధాక్షిణ్యంగా కొట్టి పారేయండి, కేటీఆర్ మాటలు
బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు వత్తిదేనని తేలిపోయింది. దీని వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఆందోళన వెనుక కొంతమంది రియల్టర్లు ఉన్నారని కాంగ్రెస్ నేతలు బలంగా వాదిస్తున్నారు.. పదేపదే చెబుతున్నారు. ఇప్పుడదే నిజమైనట్టు కనిపిస్తోంది.
కేటీఆర్ మాటల వీడియోలు చూస్తున్న మూసీ నిర్వాసితులు షాకవుతున్నారు. బీఆర్ఎస్ ఈ ద్వంద వైఖరేంటని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వ్యవహారంపై ఇంకెన్ని వీడియోలు వెలుగులోకి వస్తాయో చూడాలి. మొత్తానికి మూసీ పుణ్యమాని బీఆర్ఎస్ ముసుగు ఓపెనవుతోంది.
ఎవ్వరినీ సహించేది లేదు నిర్ధాక్షిణ్యంగా కొట్టిపారేయండి … కేటీఆర్ @revanth_anumula pic.twitter.com/JzRVDvq9Hn
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) October 1, 2024