E-Paper
Advertisement

బండి సంజయ్‌ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!

బండి సంజయ్‌ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!
Advertisement

KTR Demand: కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక మైనర్ బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఈ కేసులో బాధిత బాలికకు న్యాయం జరగాలంటూ మొదటి నుండి గళమెత్తి, అండగా నిలబడి పోరాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేతులు కలిపి బాధిత బాలికకు అన్యాయం చేయాలని చూశాయని ఆయన ఆరోపించారు. ఒకవైపు కేంద్రమంత్రి, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఈ పోక్సో (POCSO) కేసును పూర్తిగా నీరుగార్చేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. సమాజంలో తలదించుకునేలా చేసిన నిందితుడిని ఇన్నాళ్లపాటు వెనకేసుకొచ్చి, దాచిపెట్టింది స్వయంగా కేంద్రమంత్రే కాదా? అని కేటీఆర్ నిలదీశారు.

Advertisement

ఈ కేసులో అధికార, ప్రతిపక్షాలు ఎంత నొక్కేయాలని చూసినా బీఆర్ఎస్ గట్టిగా నిలబడటం వల్లే ఇవాల బాధిత బాలికకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో నిందితులను కాపాడాలని చూసే వారికి కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగే అర్హత లేదని, అందుకే బండి సంజయ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read: బండి సంజయ్ కొంపముంచిన సొంత ముఠా.. భగీరథ కేసులో అసలు గుట్టు ఇదే!

Advertisement

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×