E-Paper
Advertisement

KTR: వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. లేదంటే కోర్టుకే, బండి సంజయ్, అర్వింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు!

KTR: వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. లేదంటే కోర్టుకే, బండి సంజయ్, అర్వింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు!
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మునుపెన్నడూ లేనంతగా ముదురుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై దూకుడు పెంచారు. తనపై నిరాధారమైన, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఆరోపణలు చేసినందుకు గానూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్‌లకు ఆయన శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా ఫోన్లు వింటుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘దేశ భద్రత కోసం ఫోన్లు వినడం వేరు, కానీ మీరు రాజకీయ ప్రత్యర్థులు, హీరోయిన్లు, జడ్జీల పేర్లను మావోయిస్టుల జాబితాలో చేర్చి వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారు” అంటూ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

మరోవైపు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక అడుగు ముందుకేసి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కేవలం డ్రగ్స్ వాడటమే కాకుండా, ఆయన ఒక డ్రగ్ పెడ్లర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ తన తరపు న్యాయవాది ద్వారా ఇద్దరు ఎంపీలకు నోటీసులు పంపారు. ఐదు రోజుల్లోగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Advertisement

రాజకీయ లబ్ధి కోసం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అబద్ధాలను ప్రచారం చేయడం సరికాదని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును లాగుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ALSO READ: CM Revanth: టీ-హబ్ స్టార్టప్‌లకే సొంతం.. అమెరికా పర్యటన నుంచే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Related News

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

Big Stories

Advertisement
×