Jio Recharge Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఫ్రీ కాల్స్, డేటా మాత్రమే కాకుండా ఓటీటీ, ఏఐ సేవలు, లైవ్ గేమ్స్ వీక్షించేందుకు ఉచితంగా ఫ్యాన్ కోడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఇచ్చే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 500 లోపున్న ఉన్న ఈ 4 ప్లాన్లు.. యూజర్లకు ఎంతగానో ఉపయోగపడతాయని జియో వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్లాన్‌లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.
జియో ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఫ్యాన్ కోడ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు ప్రతీ రోజూ 2GB డేటా యూజర్లకు లభించనుంది. అలాగే అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను సైతం ఆఫర్ చేస్తున్నట్లు జియో ప్రకటించింది. అలాగే ఈ ప్లాన్ ద్వారా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. అడిషన్ బెనిఫిట్స్ కింద ‘గూగుల్ జెమిని ప్రో’ (Google Gemini Pro), జియో హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభించనుంది. అదే విధంగా జియో గేమ్స్ పాస్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి.
ఈ ప్లాన్ ను సైతం జియో 28 రోజుల వ్యాలిడిటీతోనే తీసుకొచ్చింది. ఇందులోనూ ఉచితంగా ఫ్యాన్ కోడ్ కంటెంట్ తో పాటు రోజుకు 2GB, అర్హులకు అపరిమిత 5G, ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. రూ. 399 ప్లాన్ లాగే ఇందులోనూ 5టీబీ క్లౌడ్ స్టోరేజ్‌తో కూడిన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సేవలు అందుతాయి. దీంతో పాటు అదనంగా 12 నెలల ‘కాన్వా ప్రో లైట్’ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్, జియో హాట్‌స్టార్ మొబైల్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
జియో రూ. 495 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు. రోజూ ఫ్రీ వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు యథావిధిగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు జియో గేమ్స్ క్లౌడ్, ఫ్యాన్‌కోడ్ ఉచితంగా లభిస్తాయి. పరిమిత కాల ఆఫర్ కింద 18 నెలల గూగుల్ జెమిని ప్రో ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: నోటీస్ పీరియడ్ డబ్బు చెల్లించి ఉద్యోగం వదిలేయవచ్చా.. కంపెనీ రిలీవ్ చేయకపోతే ఏం చేయాలి?
ఎక్కువగా సినిమాలు, సిరీస్‌లు చూసే వారికి రూ. 500 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత 5జీ డేటా, రోజుకు 2జీబీ డేటా, ఫ్రీ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ ప్రత్యేకం ఏంటంటే.. 15 రకాల ప్రీమియం ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఇందులో యూజర్లు పొందొచ్చు. అందులో యూట్యూబ్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్, హోయ్‌చోయ్ వంటి ప్రముఖ ఓటీటీలు ఉన్నాయి. వీటితో పాటు 18 నెలల గూగుల్ జెమిని ప్రో, 12 నెలల కాన్వా ప్రో లైట్, జియో గేమ్స్ మొబైల్, ఫ్యాన్‌కోడ్ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది.
Also Read: పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న