E-Paper
Advertisement

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్యలో కొత్త ట్విస్ట్‌.. హ‌రిబాబును నేనే చంపేశా, ఎలా ప్లాన్ చేశానంటే

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్యలో కొత్త ట్విస్ట్‌.. హ‌రిబాబును నేనే చంపేశా, ఎలా ప్లాన్ చేశానంటే
Advertisement

YouTuber Vaishnavi husband: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అసలు నిందితుడు బయటకు వచ్చాడు. సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. తాను నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోతున్నానని చెప్పాడు. అందరూ నాకు అండగా ఉండి బయటికి వచ్చేలా చూడాలని కోరాడు. ఇంకా ఆ వీడియో ఏ ముందంటే..

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్యలో కొత్త ట్విస్ట్‌

నిజామాబాద్‌ జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు.. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి ప్రేమించుకున్నారు, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 16న వైష్ణవి హత్య.. తెలంగాణ వ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైష్ణవి భర్త హరిబాబు, అతడి తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు జైలు పాలయ్యారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు హరిబాబు. రాజరాజేంద్ర స్క్వేర్ వద్ద హరిబాబు రోడ్డు పక్కనున్న భోజన శాలలో ఉన్నాడు. అంతలోపు కారులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి నేరుగా హరిబాబు వద్దకు వెళ్లాడు. పదునైన ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. స్పాట్‌లో హరిబాబు కుప్పకూలాడు, ఆ తర్వాత మృతి చెందాడు.

హ‌రిబాబును నేనే చంపేశా-వైష్ణవి సోదరుడు సంతోష్

Advertisement

దాడి తర్వాత నిందితుడు వచ్చిన కారులో వెళ్లిపోయాడు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఈలోగా రాత్రి 10 గంటల సమయంలో హరిబాబు హత్యకు సంబంధించి నిందితుడు ఓ వీడియో.. సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. హరిబాబును తాను చంపానని వైష్ణవి సోదరుడు సంతోష్ వీడియో విడుదల చేశాడు. నా చెల్లిని చంపినవాడ్ని చంపేశానని, నా చెల్లికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకు జరగకూడదని భావించి హత్యకు పాల్పడినట్టు ప్రస్తావించాడు. నేరుగా తాను పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోతున్నానని తెలిపాడు. నా చెల్లి ప్రాణాలు తీసిన భర్త హరిబాబును నేనే చంపానని పలుమార్లు వీడియోలో ప్రస్తావించాడు.

ఆనాడు వైష్ణవి చెప్పినట్టే జరిగింది

ఈ విషయంలో తనను అందరూ అర్థం చేసుకోవాలి, నా చెల్లి చావును తట్టుకోలేకపోయానని ప్రస్తావించాడు. అందరూ నాకు అండగా ఉండి, బయటికి వచ్చేలా చూడాలని వైష్ణవి చిన్న అన్న పేర్కొన్నాడు. వైష్ణవి ప్రాణాలతో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోల్లో భర్తతో గొడవలు జరిగిన సందర్భంలో కొన్ని వీడియోల్లో ప్రధానంగా ప్రస్తావించింది. నాకు ఏమైనా అయితే ఎవరు ఊరుకున్నా, మా చిన్న అన్న మిమ్మల్ని వదిలిపెట్టడు అంటూ పలు మార్లు వీడియోల్లో చెప్పింది. వైష్ణవి చెప్పిన మాటలను నిజం చేసి చూపించాడు ఆమె చిన్న అన్న సంతోష్. హత్యకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి అతని వాదనలను ధృవీకరించడానికి పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు.

Advertisement

ALSO READ: కేసీఆర్, సీఎం రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? – కేటీఆర్

వైష్ణవి తల్లికి ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వైష్ణవికి ఇద్దరు సొంత అన్నయ్యలతోపాటు చిన్నమ్మలు, పెద్దమ్మల కుమారులు 13 మంది సోదరులున్నారు. ఆ కుటుంబాల్లో వైష్ణవి ఒక్కతే ఆడ పిల్ల కావడంతో వారందరికీ ఆమె అంటే పంచప్రాణం. ఎంతో గారాబంగా చూసుకునే సోదరి హత్యకు గురికావడం వైష్ణవి సోదరులు తట్టుకోలేకపోయారు. ఆమె హత్య తర్వాత రెండువారాలు సమాధి వద్దకు వెళ్లి అందరూ విలపించడం కలచివేసింది. హంతకుడు హరిబాబును కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు ఆందోళనలు చేశారు. న్యాయం జరగని పక్షంలో తాము చంపేస్తామని ప్రతినబూనడం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది.

youtube.com/watch?v=NL7eQ-gyCUo&feature=youtu.be

 

Related News

కేసీఆర్, సీఎం రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? – కేటీఆర్

సీఎం రేవంత్‌ రెడ్డిపై రెడ్ బుక్ రాస్తున్నాం.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్.. యూకే వర్సిటీల ప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ

బాంబ్ పేల్చిన విప్ ఆది శ్రీనివాస్.. కేటీఆర్ 7289 డాక్యుమెంట్ సీక్రెట్ ఇదేనా?!

‘అప్పుడు Zero.. ఇప్పుడు రూ.వేల కోట్లు’.. కేసీఆర్‌, కేటీఆర్‌పై పొంగులేటి నిప్పులు!

కాంగ్రెస్ భూములు లాక్కుంటే.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది.. కవిత ఫైర్

ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ.. సంబురాలు చేసుకున్న స్థానికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

Advertisement
×