E-Paper
Advertisement

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!
Advertisement

సొంతిల్లు లేదు. ఉన్నా అది ఇరుకుగా ఉంది. అంత విశాలంగా లేదు. అందుకే అక్కడొకరు.. ఇక్కడొకరు అన్నట్టుగా ఉన్నాం. కేటీఆర్‌, హరీశ్‌రావు పొల్లుపోకుండా ఇవే మాటలన్నారు ఇటీవల. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్ భూముల వివాదమే దీనికి కారణం. జనాలకు ఏదో చెప్పాలనుకున్నారు. కానీ వీరికే క్లారిటీ మిస్సయ్యింది. ఇద్దరూ మాట్లాడిన మాటల్లో పరస్పర విరుద్ధ ప్రకటనలు జనాలను మరింత గందరగోళ పరిచాయంటే నమ్మండి.

మొదట భూస్వామి కుటుంబం నుంచి మొదలు పెట్టి.. ఆ వారసత్వమే వందల ఎకరాల నుంచి పుట్టుకొచ్చిందనే కవరింగు ఇచ్చుకునే దగ్గర నుంచి స్టార్ట్ చేసి.. చివరకు సీన్ ఎండింగ్‌కు వచ్చే సరికి, అసలు ఆయనకు సొంతిల్లే దిక్కులేదన్నారు. ఇద్దరూ ఇదే చెప్పారు. మొత్తానికి  అర్థమైందేంటంటే.. ఫామ్‌హౌజ్‌ భూములను పేదల నుంచి లాక్కునేంత పేదవాడు కాదని చెప్పే ప్రయత్నం మొదట జరిగింది. ఆ తరువాత కేసీఆర్‌కు పెద్దగా ఆస్తుల మీద ఇంట్రస్టే ఉండదు.. ఆయన అంత కక్కుర్తి మనిషి కానేకాదనే విషయాన్ని చెప్పడానికి సొంతిల్లు లేదు.. ఉన్నా అది చిన్నది.. ఇరుకుది. మాకు సరిపోదు.. అందుకే ఆయన దూరంగా అలా ఆయనక్కడ.. నేనిక్కడ.. ! ఇలా కవర్‌ చేసుకునే ప్రయత్నం జరిగిందనిపించింది.

Advertisement

సరే, ఇప్పుడు అసలు ముచ్చటకు వద్దాం. అక్కడ గదులు ఇరుకిరుకుగా లేవు. విశాలంగానే ఉన్నాయి. కానీ వారి మనసులే చాలా ఇరుకిరుకున్నాయి. అందుకే ఆ ఆలోచనలు కూడా ఇరుకిరుకుగానే చేస్తున్నారు. కలిసి ఉండలేకపోతున్నారు. అధికారం కోసం కన్నబిడ్డను కూడా కనికరించలేదు కేసీఆర్‌. అదే అధికారం కోసం చెల్లెను ఇంటి నుంచి బయటకు పంపేందుకూ వెనుకాడ లేదు కేటీఆర్‌.

రాజకీయంలో ఇవన్నీ మామూలే. ఎవరి రాజకీయాల కోసం వారు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు..! అని సరిపెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ కుటుంబం ఉద్యమాన్ని మేమే నడిపామని చెబుతున్నది. మా వల్లనే తెలంగాణ వచ్చిందని రొమ్ము విరుచుకుని ప్రకటించుకుంటున్నది. కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత అని బాజాప్తాగా కాలర్‌ ఎగురేసుకుని చెబుతున్నది. ఈ ఉద్యమం పేరుతోనే వారికి గుర్తింపు వచ్చింది. అధికారం వచ్చింది. ఆస్తులు వచ్చాయి. జనం ఆదరించారు. మరి ఆ కుటుంబాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు కదా!  స్పూర్తిగా తీసుకుంటారు. నమ్మకంగా చూస్తారు.

Advertisement

ఆస్తులు కూడబెట్టుకున్న మాట వాస్తవం. మీరెంత చెప్పినా జనానికి ఆ విషయం తెలుసు. అంతస్తులు ఉన్న మాట నిజమే. విశాలమైన భవంతులు నిర్మించుకున్నదీ జనం కళ్లకు కనిపిస్తనే ఉన్నది. మీకు మీకు పడక.. ఇరుకు మనసులు కలవక.. దూరమయ్యారని కూడా మీరే ప్రపంచానికి చెప్పుకున్నారు.

కవిత ఎందుకు పార్టీకి దూరమయ్యారు..? జాతిపిత అని పిలుచుకుంటున్న తండ్రి కేసీఆర్‌ మీద అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు..? తోడబుట్టిన అన్న అక్రమాలను ఎందుకు నిగ్గు తేల్చుతున్నారు? అవన్నీ అబద్దాలేనా? కానే కాదు.  ఆ కుటుంబ కుంచిత మనస్తత్వాల కారణంగా, అధికారం కోసం బంధాలను కూడా కాలరాసుకునేందుకు వెనుకాడని  ఇరుకైన మనసుల వల్లే ఇదంతా  బయటకు వచ్చింది. జనానికి ఈ విషయాలన్నీ తెలిసేలా చేసుకున్నది వారి వారి మనస్తత్వాలే. రాజకీయ ప్రత్యర్థులకు ఎన్నైనా సమాధానాలివ్వొచ్చు. ఎదురుదాడి చేయొచ్చు. కానీ జనం ముందు ఆవిష్కృతమైన ఈ ఇరుకు మెంటాలిటీని సమర్థించుకునే ప్రయత్నం ఎంత చేసినా వృథా ప్రయత్నమే. కుండ పలిగితే పలిగింది గానీ కుక్క బుద్ది తెలిసింది.. అన్నట్టుగా ఆ కుటుంబ విశాల దృక్పథం ఏపాటిదో అధికారం పోయిన తరువాతగానీ తెలిసి రాలేదు తెలంగాణ జనానికి.

Tags

Related News

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొత్తలో విపరీతమైన పేదరికంలో కేసీఆర్.. అప్పుడు పది రూపాయల మిత్తీకి బాకీలు ఎందుకు చేసినట్టు..?

అన్ని విచారణలు ఓ లెక్క.. ఫామ్ హౌజ్ భూముల లెక్కలు ఓ లెక్క.. నిగ్గుతేల్చాల్సిందే..! లేకపోతే……

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

డేంజర్‌లో మెట్రో.. పిల్లర్లను తవ్వేస్తున్న బడాబాబులు, కళ్లు మూసుకున్న అధికారులు!

మిస్టేక్ ఎవరిదీ.. 22 ఏలో సర్కార్ బ్లేమ్ వెనక కుట్ర ఉందా..?

Big Stories

Advertisement
×