Big Stories

KTR Rytu Bandhu | రైతు బంధుపై కేటీఆర్ పాలిటిక్స్.. హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాలి!

KTR Rytu Bandhu | సరిగ్గా ఎన్నికల ముందు రైతుబంధును ఆపడంపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. రైతుబంధుపై మంత్రి హరీష్‌రావు మాట్లాడితే ఆయనకు నోటీసులివ్వాలి కానీ రైతుబంధును ఆపడమేంటని ప్రశ్నించారు. ఒకవైపు కాంగ్రెస్, బిజేపీ కలిసి రైతు బంధు ఆపేందుకు కుట్ర చేశాయని చెబుతూనే.. హరీష్ రావుని కూడా విమర్శించారు. అసలు రైతుబంధును ఎందుకు ఆపాలంటూ ప్రశ్నించారు కేటీఆర్‌.

- Advertisement -

రైతు బంధు ఆపడంలో కాంగ్రెస్ పాత్ర లేదని ఇప్పటికే పలుమార్లు తేలింది. మంగళవారం సీనియర్ బిఆర్ఎస్ నేత కేకే అలియాస్ కే కేశవరావు కూడా ఇదే మాట అన్నారు. అయినా కేటీఆర్ మాత్రం ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేశాయని చెబుతున్నారు. మరోవైపు తప్పు హరీష్ రావుదని అంగీకరిస్తున్నారు.

- Advertisement -

కేటీఆర్‌ తీరు చూస్తుంటే తెలివిగా హరీష్‌రావును ఇరికించేలా ఉంది. తప్పు బీఆర్ఎస్ పార్టీది కాదని.. కేవలం హరీష్‌రావుదే అన్నట్టుగా ఉంది ఆయన మాట్లాడుతున్నారు.

రైతు బంధు ఆగిపోవడంతో ఎన్నికల్లో రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకోవాడానికి బిఆర్ఎస్‌ కొత్త రాగమిది. సమస్యని ఆర్థికమంత్రి హరీష్‌రావు పైకి తోసేసేందుకు బీఆర్ఎస్‌ లో ప్లాన్ జరిగిందా? ఎందుకంటే.. ఇవాళ మరో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడగా.. మొన్న ఎన్నికల సంఘం అధికారులతో భేటీ తర్వాత బీఆర్ఎస్ కీలక నేత కె.కేశవరావు కూడా ఇలాగే మాట్లాడారు. ఆ విషయాన్ని హరీష్ అభిమానులు గుర్తుచేస్తున్నారు.

.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News