E-Paper
Advertisement

KTR Press Meet : ఓటమి గుణపాఠం.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం..

KTR Press Meet : ఓటమి గుణపాఠం.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం..
Advertisement
ktr press meet

KTR Press Meet : నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బాధలేదు. అసంతృప్తిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజల తీర్పుతో తాము కొత్త పాత్రలోకి వెళుతున్నామన్నారు. ప్రతిపక్ష పాత్రలో ఇమిడిపోయి ప్రజల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. కొంత సమయం ఇస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని ఆశిస్తున్నామన్నారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తెలిపారు.

లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రమించారని కేటీఆర్ అన్నారు. గతంలో కన్నా మెజార్టీ సాధిస్తామని ఆశాభావంతో ఎన్నికలకు వెళ్లామన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడ కోల్పోయామో మళ్లీ అక్కడే తెచ్చుకుందామన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు మెదక్ జిల్లా ఓటర్లు బీఆర్ఎస్ కు పూర్తిగా అండగా ఉన్నారని తెలిపారు. కొన్నిచోట్ల స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని.. మంత్రులు ఓడిపోయారని వివరించారు. దాదాపు 12 మంది స్వల్ప తేడాతో ఓడిపోయారని చెప్పారు. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తెలంగాణ పోరాట స్పూర్తితో పనిచేస్తామని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు నిరాశకు లోనుకావద్దని మంచిరోజులు వస్తాయని చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా పైకి లేద్దామంటూ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×