BigTV English
Advertisement

Chhattisgarh Polls 2023 | ఛత్తీస్ గఢ్‌లో పట్టుకోల్పోయిన కాంగ్రెస్.. డిప్యూటీ సిఎం ఓటమి.. బిజేపీకే పట్టం!

Chhattisgarh Polls 2023 | ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఛత్తీస్ గఢ్‌లో బిజేపీ విజయం వైపు దూసుకుపోతోంది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్ గడ్ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే.. మేజిక్ ఫిగర్ 46ను అందుకోవాలి

Chhattisgarh Polls 2023 | ఛత్తీస్ గఢ్‌లో పట్టుకోల్పోయిన కాంగ్రెస్.. డిప్యూటీ సిఎం ఓటమి.. బిజేపీకే పట్టం!

Chhattisgarh Polls 2023 | ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఛత్తీస్ గఢ్‌లో బిజేపీ విజయం వైపు దూసుకుపోతోంది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్ గడ్ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే.. మేజిక్ ఫిగర్ 46ను అందుకోవాలి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ప్రస్తుతం భూపేష్ సింగ్ బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్నికల్లో 76.88% పోలింగ్ నమోదైంది.


ఛత్తీస్ గఢ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బిజేపీ 54 స్థానాల్లో ముందంజలో ఉంటే.. కాంగ్రెస్ 34 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. పాటన్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్ వెనుకంజలో ఉన్నారు. మరో షాకింగ్ న్యూస్.. డిప్యూటీ సిఎం టిఎస్ సింహ దేవ్ కేవలం 122 ఓట్లతో ఓడిపోయారు.

అసలు కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.


2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. బిజేపీ మాత్రం 15 సీట్లకే పరిమితమైంది. ఆ తరువాత భూపేష్ సింగ్ బఘేల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన 11 స్థానాల్లో కూడా ప్రస్తుతం బిజేపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.

ఛత్తీస్ గడ్ బిజేపీలో సీనియర్ నాయకుడు డాక్టర్ రమన్ సింగ్. ఆయన 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈసారి విజయం సాధిస్తే మళ్లీ ఆయననే సిఎంగా బిజేపీ ప్రకటించే అవకాశాలున్నాయి. కానీ కొందరు ప్రాంతీయ నాయకులు కూడా సిఎం పదవి కోసం పోటీపడుతున్నారు. వారిలో అరుణ్ సావ్, ఓపి చౌధరి, విజయ్ బఘేల్, రేణుకా సింగ్, విష్ణుదేవ్ సాయ్ ఉన్నారు.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×