
Madhapur drugs case updates(Telangana news live) :
సంచలన రేపుతున్న మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నాకర్‌రెడ్డి విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ కేసును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు వెంకట్ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతడిపై 25కుపైగా కేసులు ఉన్నాయని తేలింది.
వెంకట రత్నాకర్‌రెడ్డి తాను ఐఆర్ఎస్ అధికారినంటూ చెప్పుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు సినీ నిర్మాతల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. అలాగే ఓ అధికారిని మ్యారేజ్ పేరుతో మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులకు వెంకట రత్నాకర్ రెడ్డి వల వేస్తున్నాడని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు. వెంకట రత్నాకర్ రెడ్డి హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్నాడని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల విచారణలో తేల్చారు.
వెంకట రత్నాకర్‌రెడ్డి మొబైల్‌ను పోలీసులు పరిశీలించారు. అతడితో పరిచయం ఉన్నవారిని ప్రశ్నించాలని భావిస్తున్నారు. నైజీరియన్లతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వెంకట రత్నాకర్ రెడ్డి నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. కొకైన్, ఎల్‌ఎస్‌డీ, గంజాయితోపాటు ఇంకా ఏ డ్రగ్స్‌ను పార్టీల్లో ఉపయోగించారన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Revanth Reddy : ఎర్రబెల్లిని ఓడించండి.. పాలకుర్తి ప్రజలకు రేవంత్ పిలుపు..